న్యూజిలాండ్ గడ్డపై… అ దేశాన్ని టీమిండియా వైట్ వాష్ చేసింది. ఐదు టీ ట్వంటీల సీరిస్‌లో ఐదింటిలోనూ సాధికార విజయాలు నమోదు చేసింది. వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో తమకన్నా.. ఫేవరేట్లు ఎవరూ లేరని సందేశం పంపింది. ఐదో టీ ట్వంటీలో.. కెప్టెన్ కోహ్లీ రెస్ట్ తీసుకున్నారు. పగ్గాలను రోహిత్ శర్మ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మరీ అంత దూకుడైన ఆటనేమీ ప్రదర్శించలేదు. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్లో వికెట్ కావడంతో… వికెట్లు కాపాడుకుని.. వీలైనంతగా… పరుగులు తీయడానికి బ్యాట్స్మెన్లు ప్రయత్నించారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. 41 బంతుల్లో అరవై పరుగులు చేశారు.
కేఎల్ రాహుల్ 41, శ్రేయస్ అయ్యర్ 33 పరుగులు చేశారు. పెద్దగా కష్టం కానీ 164 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన… కివీస్..ఓ దశలో… విజయం దిశగా వెళ్తున్నట్లుగానే అనిపించింది. 12.4 ఓవర్లరు నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసిన దశలో… పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకూ నిలకడా ఆడుతున్న టిమ్ సీల్ఫర్ట్ ఔట్ అవడంతో.. వికెట్ల పతనం ప్రారంభమయింది. అయితే.. రాస్ టేలర్ గట్టిగా నిలబడటంతో.. కొంత మేరు కివీస్.. చివరి వరకూ ఆశలు నిలుపుకుంది. 133 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌గా… రాస్ టేలర్ కూడా ఔటయిపోవడంతో.. న్యూజిలాండ్ ఓటమి ఖరారయింది. తర్వాత ఎవరూ నిలబడలేకపోయారు.
చివరికి…. 156 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది . మూడు, నాలుగు టీ ట్వంటీల్లో కివీస్ సూపర్ ఓవర్లలో ఓడిపోవడం.. ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీసినట్లుగా కనిపిస్తోంది. ఓటమికి మానసికంగా సిద్దమైపోయి ఆడుతున్నట్లుగా ఆడుతూ వచ్చారు. ఐదు మ్యాచ్‌లో టీ ట్వంటీ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం.. అదీ కివీస్‌పై.. ఇలాంటి విజయం సాధించడం ఇదే మొదటి సారి. రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు కూడా… ఎంతో బలంగా ఉన్నారని… టీమిండియాకు ఎదురులేదని… ఈ మ్యాచ్‌లో నిరూపితమయిందంటున్నారు. పేపర్‌పై టీమిండియాకు సమ ఉజ్జీగా కనిపించిన… కివీస్.. చివరికి కనీస పోటీ కూడా ఇవ్వని టీంగా నిలిచిపోయింది.