టీ20 ప్రపంచకప్లో వైఫల్యం చెందిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్ టీ20 సిరీస్ ని కైవసం చేసుకుంది. మూడు మ్యచుల సిరిస్ లో 1-0 ఆధిక్యంతో టైటిల్ ని గెలిచుకుంది భారత్. ఈ సిరిస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. రెండో మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించి చక్కని విజయం సాధించింది ఇండియా. ఈ రోజు జరిగిన మూడో మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. డేవన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధశతకాలు సాధించారు. టీమ్ఇండియా బౌలర్లు సిరాజ్ (4/17), అర్ష్దీప్ సింగ్ (4/37)తో ఆకట్టుకున్నారు.
ఆనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది భారత్. అయితే ఈ దశలో భారీ వర్షం కురిసింది. మ్యాచ్ ని రద్దు చేసి టై గా ప్రకటించారు. దీంతో సిరిస్ లో ఒక విజయం సాధించిన భారత్ కు సిరిస్ ని కైవసం చేసుకుంది. నవంబర్ 25 న వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.