ఇంగ్లండ్ పై టెస్టు, టీ 20 సిరీస్ ని గెలుచుకున్న ఇండియా… వన్డే ల్లోనూ శుభారంభం చేసింది. పూణెలో జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో.. 317 పరుగులు చేసింది. ఫామ్ లో లేక తంటాలు పడుతున్న థావన్ (98) తృటిలో సెంచరీ కోల్పోయినా… కీలక ఇన్నింగ్స్ ఆడి, టచ్లోకి వచ్చాడు. కోహ్లి (56), రాహుల్ (62 నాటౌట్) రాణించారు. తొలి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్యా విజృంభించి ఆడడంతో (31 బంతుల్లో 58) భారత్ భారీ స్కోరు సాధించింది.
అనంతరం బెన్ స్ట్రో (66 బంతుల్లో 94), రాయ్ (35 బంతుల్లో 46) తుఫాను ప్రారంభం ఇవ్వడంతో పరుగులు వరదలై పారాయి. తొలి వికెట్కు 130 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. ఇంగ్లండ్ ఈ టార్గెట్ ని సులభంగా చేధిస్తుందనిపించింది. అయితే.. ఈ దశలో భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ తడబడింది. చివరికి 251 పరుగులకే కుప్పకూలింది. తొలి వన్డే ఆడుతున్నప్రదీప్ కృష్ణ 54 పరుగులకు 4 వికెట్ల తీసుకుని ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ రెండు కీలకమైన వికెట్లు తీసుకున్నాడు.