తొలి టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన పరాభవానికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకొంది. విశాఖ టెస్ట్ లో 106 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకొంది. 399 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 292 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు దక్కించుకొని ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. దీంతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
ఒక దశలో ఇంగ్లండ్ జట్టు 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో అన్న అనుమానం కలిగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు వేగంగా పరుగులు తీస్తూ లక్ష్యానికి దగ్గరైంది. అయితే భారత బౌలర్లు కీలకమైన సమయాల్లో వికెట్లు తీశారు. బెన్ స్ట్రోక్స్ రనౌట్ అవ్వడం మరింత కలిసొచ్చింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ కావ్లీ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జైస్వాల్ డబుల్ సెంచరీతో ఆకట్టుకొన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లానే రెండో టెస్ట్ కూడా 4 రోజుల్లోనే ముగియడం విశేషం.