ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ బ్యాట్స్‌మెన్‌కు ఏదీ కలసి రావడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ కొండంత లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. దాన్ని అందుకునేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు కానీ.., దరి దాపుల్లోకి కూడా రావడం లేదు. సిడ్నీలో జరిగిన రెండో వన్డేలో భారత్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. యాభై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. కానీ అంతకు ముందు ఆస్ట్రేలియా ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. అంత భారీ లక్ష్యాన్ని చూసి బెదిరి పోకుండా.. భారత ఆటగాళ్లు పోరాడారు. కానీ పోరాటం సరిపోలేదు.
390 పరుగుల లక్ష్య చేధనలో ఓపెన్లరు దావన్, అగర్వాల్ శుభారంభమే ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నిలదొక్కుకోలేకపోయారు. అగర్వాల్ 28, ధావన్ 30 పరుగులు చేసి ఔటైపోయారు. పెద్దగా ఫామ్‌లో లేని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఒత్తిడి లేకుండా ఆడాడు. అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్డడమే కాకుండా.. స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అయ్యర్ 38 పరుగులు చేసి ఔటైయ్యాడు. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్… కెప్టెన్‌తో కలిసి.. ధాటిగా ఆడి.. ఆశలు కల్పించారు. కానీ విజయ తీరాలకు చేరుస్తాడని ఆశలు పెట్టుకున్న కోహ్లీ 89 పరుగుల వద్ద ఔటయ్యాడు.
లోయర్ ఆర్డర్ ఫూర్తిగా ఫెయిలవడం… సాధించాల్సిన రన్ రేట్ అమాంతం పెరిగిపోవడంతో.. చివరికి చేతులెత్తేశారు.
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. తొలి మ్యాచ్‌లో హడలెత్తించిన స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లోనూ 64 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. వార్నర్ , ఫించ్ సహా బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ బ్యాట్‌కు పని చెప్పడంతో ఆస్ట్రేలియా స్కోరు రాకెట్ వేగంతో పెరుగుతూ పోయింది. చివరికి 389 పరుగుల వద్ద ముగించారు. తొలి వన్డేలో ఆస్ట్రేలియా 50 ఓవర్లకు 374 పరుగులు చేసింది. అప్పుడు భారత్ 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిడ్నీ గ్రౌండ్లో బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉండటంతో సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు.