“ఎమెర్జింగ్ మార్కెట్స్” అనే సంస్థ ప్రతీ ఏటా ప్రకటించే “ఆసియా ఉత్తమ ఆర్ధిక మంత్రి” అవార్డు ఈ ఏడాది ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ గెలుచుకొన్నారు. కేవలం 18నెలల కాలంలోనే ఆయన చేపట్టిన అనేక చర్యలు, సంస్కరణల ద్వారా భారత ఆర్ధిక రంగం బలోపేతం అవడమే కాకుండా చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందని ఎమెర్జింగ్ మార్కెట్స్ సంస్థ అరుణ్ జైట్లీని ప్రశంసించింది. ఇంతకు ముందు 2010 సం.లో దేశ ఆర్ధిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీకి ఈ అవార్డు అందుకొన్నారు. మళ్ళీ ఐదేళ్ళ విరామం తరువాత మళ్ళీ భారత ఆర్దికమంత్రికి ఆసియాదేశాలలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గొప్ప ఆర్ధికవేత్తగా పేరున్న డా.మన్మోహన్ సింగ్ కి ఈ అవార్డు రాకపోవడం చాలా విచిత్రమే. కానీ ఆయన 1993,94సం.లలో వరుసగా రెండు సార్లు “ఏసియా మనీ” మరియు “యూరో మనీ” అనే సంస్థల నుండి “ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకొన్నారు. అరుణ్ జైట్లీ అందుకొన్న ఈ అవార్డు వ్యక్తిగతంగా ఆయన పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేయవచ్చును. కానీ అదే సమయంలో ప్రపంచ దేశాలకి భారత్ పట్ల మరింత సానుకూల దృక్పధం ఏర్పరిచేందుకు ఇది దోహదపడవచ్చును.