కశ్మీర్లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటే తప్ప..ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం కాదు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచే ఉగ్రవాదం
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రక్షణ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. గతంలో పీవోకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసింది. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. అందుకే.. పీవోకేను తిరిగి పొందాలన్న కృతనిశ్చయంతో.. కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు కూడా.. మోడీ, షా నిర్ణయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దౌత్య పరంగా.. చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే.. ఇతర మార్గాలను రెడీ చేసుకోవాలంటున్నారు.
క్రిమియాను రష్యాకు అప్పగించేలా చేస్తున్నట్లే పీవోకేనూ తీసుకోవాలి !
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది. తమ దేశంపై కుట్రలు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది . క్రిమియా అనే ప్రాంతాన్ని ఇచ్చేయాలని ట్రంప్ కూడా ఉక్రెయిన్ పై ఒత్తిడి. తెస్తున్నారు. పీవోకే విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే భారత్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఓకేను వెనక్కి తీసేసుకోవాలని, అందులో మూడో దేశ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం ఆమోదించారు. పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడిచేస్తే.. ట్రంప్ కూడా భారత్ కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది.
పీవోకే కోసం ప్రాణాలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటన
చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ రెండూ భారత్ లో భాగమే. వాటిని తిరిగి తెచ్చుకునేందుకు అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్లో ప్రకటించారు. పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. పీవోకేను.. సర్వనాశనం చేయడానికైనా అంగీకరిస్తుంది కానీ.. అప్పగించదు. సేనలు నేరుగా ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లిపోవడం మినహా వేరు గత్యంతరం కూడా లేదు. ఇప్పటికే రెండు సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు.. పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. భారతదేశమే మొదట దాడి చేసిందన్న అపవాదు రాకుండా ఇప్పుడు పెహల్గాం దాడి ఘటన ఉపయోగపడుతుంది.
పాకిస్తాన్ ఆయువు మీద దెబ్బకొట్టాలి !
పీవోకే విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయండ భారత్కు ముఖ్యం. అయితే.. మోడీ , షాల నేతృత్వంలో అది పెద్ద విషయం కాదు. పీవోకేను.. భారత్లో చేర్చితే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే.. దేశ విభజన నాటి నుంచి.. సరిహద్దుల్ని ఉద్రిక్తతంగా ఉంచుతూ.. వస్తున్న.. సీమాంతర ఉగ్రవాదం… అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది.