చైనాకు చెందిన 59 యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో టిక్ టాక్ కూడా ఉంది. అలాగే… అలీ బాబా గ్రూప్‌నకు చెందిన యూసీ బ్రౌజర్‌ను కూడా నిషేధించింది. ఎక్కువ మంది ఉపయోగించే బిగో లైవ్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ కమ్యూనిటీ, షేర్ ఇట్, వీగో వీడియో లాంటి యాప్స్ అందులో ఉన్నాయి. చైనా యాప్స్..భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా సేకరిస్తున్నాయన్న అనుమానం టెక్ నిపుణుల్లో చాలా కాలంగా ఉంది. వాటికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించడంతో.. దేశ ప్రజల సమాచారం.. చైనా చేతికి చేరుతోందన్న క్లారిటీ రావడంతో… యాప్స్‌ను నిషేధించినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా చైనా యాప్స్… అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చిన తర్వాతే.. ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
59 యాప్స్‌లో అత్యంత వివాదాస్పదమైనది.. టిక్ టాక్. అత్యధిక మంది యూజర్లు ఉన్న ఈ యాప్ ద్వారా టిక్ టాక్‌కు పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. దీనిలో అసభ్యత.. అశ్లీలం పెరిగిపోవడంతో.. గతంలో.. కొన్ని రాష్ట్రాల హైకోర్టులు నిషేధించాయి. తర్వాత ఏదో కారణం చెప్పుకుని అనుమతి తెచ్చుకున్నారు కానీ.. ఎప్పుడు చైనాతో.. ఘర్షణలు తలెత్తినా.. చాలా మందికి ఈ యాప్ టార్గెట్. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత టిక్ టాక్ అన్ఇన్స్టాల్ ఉద్యమం నడిచింది. లాక్ డౌన్ టైంలో… అత్యధిక మంది డౌన్ లోడ్ చేసుకుని టైమ్ పాస్ చేశారు. ఈ కారణంగా ఆ ఉద్యమం పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు కేంద్రం బ్యాన్ చేసింది.
నిషేధించిన 59 యాప్స్.. భారత అంతర్గత రక్షణ, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిషేధంతో .. ఆ యాప్స్ పని చేయడం నిలిచిపోతాయి. ఈ యాప్స్ నిలిపివేయడం వల్ల.. చైనీస్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. బాయ్ కాట్ చైనా ఉద్యమంలో… ఆ దేశాన్ని .. ఆ దేశ ఉత్పత్తులను ప్రజలకు దూరం చేయడంలో.. కేంద్రం ఓ అడుగు ముందుకు వేసిందని అనుకోవచ్చు.
Govt of India bans 59 Chinese apps including TikTok pic.twitter.com/oZ5C6IeA7G
— Anshul Saxena (@AskAnshul) June 29, 2020