అమెరికాలో ఓ కిరాణా స్టోర్ యజమానిని బెదిరించి లక్ష డాలర్లు కొట్టేయాలనుకున్న నలుగురు చిల్లర వెధవల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూకాల్లో మోసాలని.. బిర్యానీలో బొద్దింకలని బెదిరించే బాపతు బ్లాక్ మెయిల్ గాళ్లు చాలా మంది హైదరాబాద్ లో కనిపిస్తూ ఉంటారు. ఇపుడు ఇలాంటి వాళ్లు అమెరికాకూ పాకిపోయారు. అక్కడిదాకా వెళ్లినా తమ బుద్ది పోనిచ్చుకోకుండా చేసిన ఈ వ్యవహారం వారి తల్లిదండ్రులు, బంధువుల పరువు తీసింది.
డాలస్‌లో తెలుగువారు నిర్వహిస్తున్న కిరాణా స్టోర్‌లోనే ఉప్పాల రోహిత్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులు చేసిన నిర్వాకం బయటపడింది. అక్కడి వరకూ వెళ్లడానికి వారు చాలా కష్టపడి ఉంటారు. వారి తల్లిదండ్రులు చాలా ఖర్చు పెట్టి ఉంటారు. కానీ అక్కడికి వెళ్లి వారు చేసిందేమిటి ? . ఆ వీడియోలు చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు తల ఎక్కడ పెట్టుకుంటారు ?
అలాంటి పనులు చేయడానికి అదీ తెలుగువాళ్లనే బెదిరించడానికి అక్కడి వరకూ పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే బోలెడన్ని చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఏవో చిల్లర కేసులు పెడతారు.కానీ అక్కడ అలా చేస్తే మొత్తం ఇండియా మొత్తం ప్రచారం అవుతుంది. ఇప్పుడు అలాగే అయింది. దీని వల్ల లైఫ్ లాంగ్ దొంగలన్న ముద్ర పడుతుంది. ఇలాంటి ఆలోచనలతో అమెరికా వెళ్లి దేశం పరువు తీయడం కన్నా.. ఇండియాలోనే గజదొంగలుగా మారడం బెటర్ ఆప్షన్. ఎప్పుడు నేర్చుకుంటారో మరి !