అమెరికాలో పట్టుబడిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహవూర్ రాణాను ఇండియాకు తీసుకు వస్తున్నారు. ఆయన కోసం ఇండియా చాలా కాలం పాటు న్యాయపోరాటం చేసింది. చివరికి ట్రంప్ ఆ దరిద్రం తమకెందుకని.. ఇండియాకు అప్పగించేందుకు అంగీకరించారు. ఇంకా అనేక టెర్రరిస్టు నేరాలతో సంబంధం ఉన్న ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడి జైలు నుంచి ఇండియాకు తీసుకు వచ్చారు.
తహవూర్ రాణా పాకిస్తాన్ బ్లడ్ ఉన్న కెనడా జాతీయుడు
తహవూర్ రాణా పాకిస్తాన్ దంపతులకు కెనడాలో జన్మించారు. ఉగ్రవాద కార్యకలాపాలాల్లో రాటుదేలిపోయారు. ఇండియన్ ముజాహిదిన్ వంటి సంస్థలకు ఆర్థిక వనరుగా మారారు. ముంబై పేలుళ్లు కేసులో ప్రధాన నిందితుడు అయిన హెడ్లీకి .. పూర్తి స్థాయిలో సాయం చేసింది రాణానే. ఆ విషయం దర్యాప్తులో తేలడంతో అతని కోసం భారత్ గాలించింది. ఆ సమయంలో అమెరికాలో పలు కేసుల్లో అతను అరెస్టు కావడంతో ..అమెరికాతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం సాయంతో ప్రయత్నాలు చేశారు. అక్కడ కోర్టుల్లో పిటిషన్లు వేసి ప్రయత్నాలు చేశారు.
భారత్ వినాశనానికి కుట్రదారుడు, తహవూర్ రాణాకు భారత్ అంటే విద్వేషం. ఆయన ఎప్పుడూ భారత గడ్డపై అడుగు పెట్టలేదు. కానీ విధ్వంసం మాత్రం అనేక సార్లు చేయించాడు. ముంబై దాడుల కేసులో పట్టుబడిన కసబ్‌కు చట్ట ప్రకారం ఉరిశిక్ష వేశారు. అయితే ఆ కసబ్ తమ యువకుడు కాదని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. కానీ సాక్ష్యాలన్నీ కసబ్ తో పాటు తహవూర్ రాణా ప్రమేయం నిరూపించాయి. కోర్టు కూడా ఆయనను దోషిగా తేల్చింది. దొరకలేదు కాబట్టి శిక్ష ఖరారు చేయలేదు.
ఉరిశిక్ష వేయగలరా ?
కసబ్‌కు ఉరి వేసినందున.. తహవూర్ రాణాకు కూడా ఉరిశిక్ష వేయాల్సి ఉంది. అయితే అధికారికంగా కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఆయనకు ఉరి వేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు ఉన్నాయి. అమెరికా నుంచి నేరస్తుల అప్పగింత కింద తీసుకు వచ్చినందున ఆయనకు ఉరి వేస్తే అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతుంది. భారత్ పై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో మన న్యాయవ్యవస్థ.. ఆయనకు ఉండే న్యాయపరమైన అవకాశాల కారణంగా ఎంత కాలం ఆయనను బిర్యానీలతో మేపాలో కూడా అంచనా వేయలేరు. కానీ మరోసారి టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడాలంటే భయపడేలా శిక్ష ఉండాలని జనం కోరుకుంటున్నారు