రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు కొద్ది సేపటి క్రితం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు:
- బడ్జెట్: రూ. 1.21 వేల కోట్లు.
- 2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1,84, 820 కోట్లు.
- రోజుకి కనీసం ఏడు కిమీ కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేయాలనే లక్ష్యం
- వచ్చే ఏడాదిలోగా 2,000 కిమీ రైల్వే మార్గాలు విద్యుదీకరణ చేయడం.
- గుజరాత్ లోని వడోదరాలో ఇండియన్ రైల్వే అకాడమీ (యూనివర్సిటీ) ఏర్పాటు.
- ఈ టికెటింగ్ విధానంలో ప్రస్తుతం నిమిషానికి 2000 టికెట్లు జారీ అవుతున్నాయి. వాటిని 7200 కి పెంచడం.
- ఈ ఏడాదిలోనే వివిధ రైళ్ళలో 17,000 బయో-టాయిలెట్ల ఏర్పాటు.
- చెన్నై లో రైల్వే ఆటో హబ్ ఏర్పాటు.
- హెల్ప్ లైన్ నెంబర్: 13ద్వారా రైల్వే టికెట్ల క్యాన్సిలేషన్ సౌకర్యం
- దేశ వ్యాప్తంగా కొత్తగా 1700 ఆటోమేటిక్ టికెట్ అమ్మకాల యంత్రాల ఏర్పాటు.
- దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో 2500 ఆటోమేటిక్ మంచి నీళ్ళ అమ్మకాల యంత్రాల ఏర్పాటు.
- 50 ఏళ్ల వయసు పైబడిన వారికోసం లోవర్ బెర్త్ కోటా పెంచబడుతుంది.
- కొత్తగా మరో 100 స్టేషన్లలో వైఫీ సౌకర్యం ఏర్పాటు.
- జర్నలిస్టులకు ఈ-బుకింగ్
- పసిపిల్లలకు, చిన్న పిల్లలకు కూడా రైళ్ళలో ప్రత్యేక ఆహారం (బేబీ ఫుడ్) అందిస్తాము.
- రైల్వే కంపార్టుమెంటుల శుభ్రం చేయమని కోరేందుకు (క్లీన్ మై కోచ్ ఆన్ డిమాండ్) వీలుగా ప్రత్యేక ఫోన్ నెంబర్ ఏర్పాటు.
- అంగవైకల్యం కలిగిన వారి కోసం రైళ్ళలో ప్రత్యేక టాయిలెట్లు.
- వచ్చే ఐదేళ్ళలో రైల్వేల అభివృద్ధి కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.
- రద్దీగా ఉండే రైలు మార్గాలలో రాత్రిపూట డబుల్ డక్కర్ రైళ్ళను నడిపించబడతాయి.
- బాగా రద్దీ ఉండే రైల్వే మార్గాలలో అంత్యోదయ పేరుతో సుదూర ప్రాంతాలను కలిపే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రవేశపెట్టబడతాయి.
- దేశంలో పుణ్యక్షేత్రాలను కలుపుతూ ‘ఆశ’ పేరుతో కొత్తగా రైళ్ళు.
- పుణ్యక్షేత్రాలు- తిరుపతి, గయా, వారణాసి, పూరి, మథుర, నాశిక్, నాందేడ్, నాగపట్టణం,
- అమ్రిత్ సర్, తదితర రైల్వే స్టేషన్ల సుందరీకరణ
- రైల్వే కూలీలను ఇకపై ‘సహాయక్’ అని పిలవబడతారు. వారి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా వారి యూనిఫార్మ్ కూడా మార్చబడుతుంది. ప్రయాణికులతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై వారిలో అవగాహన పెంచేందుకు వారికి సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వబడుతుంది.
- పెట్రోలియం సంస్థల నుండి నేరుగా డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా రూ. 1500 కోట్లు పొదుపు చేయబడుతుంది.
- రైల్వే బోర్డు యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేసి బోర్డు చైర్మన్ కి మరిన్ని అధికారాలు కట్టబెట్టబడతాయి.
- ఎంపిక చేసిన ఐదు రైల్వే ఆసుపత్రులలో ‘ఆయుష్ విధానం’ ప్రవేశపెట్టబడుతుంది.
- ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ల ద్వారా రైళ్ళలో ప్రయాణికులకు వినోదం కల్పించేందుకు ఆహ్వానం.
- అన్ని రకాల రిజర్వేషన్ కోటాలలో మహిళలకు 33 శాతం సబ్ కోటాగా కేటాయింపు.
- 2018 నాటికి కోల్ కత మెట్రో రైల్ నిర్మాణం పూర్తి చేయబడుతుంది.