ఇండియా కుబేరులు ఇండియాలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. మంచి దేశం చూసుకుని అక్కడ ఉండిపోయి.. అక్కడి నుండే వ్యాపారాలు చూసుకోవాలనుకుంటున్నారు. ఇటీవల తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఓనర్ బ్రిటన్ వెళ్లిపోయారు. ముఖేష్ అంబానీ కూడా చాలా పెద్ద ఇల్లు అక్కడ కొనేశారని మకాం మార్చబోతున్నారని ప్రచారం జరిగింది. వీరే కాదు అంతులేని సంపద సృష్టించుకున్న వారెవరూ ఇండియాలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఈ విషయం వలస వెళ్లిపోతున్న వారి సంఖ్యతోనే తేలిపోతోంది .
2022లో అలా 8వేల మంది పెట్టే, బేడా సర్దుకుని వెళ్లిపోతున్నట్లు లెక్కతేలింది. విదేశాల్లో స్థిర నివాసమే తమ కుటుంబానికి మంచిదని వారు నిర్ణయానికి వచ్చారు.. 2019వ సంవత్సరంలో 7,000 మంది భారతీయ ధనవంతులు విదేశాలకు వెళ్లిపోగా, అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6,000గా ఉన్నది. 2015లో 4,000 మందిగా ఉంటే, రెండేండ్లలో 3,000 మంది పెరిగినట్లు అనుకోవాలి. ఈ ఏడాది ఆఖరుకు 8 వేల మంది వలస పోతారని అంచనా.
దుబాయ్ కేంద్రంగా యూఏఈ అని పిలిచే ఎమిరేట్స్ దేశాలకు ఈ ఏడాది ఎక్కువ మంది వెళ్తారని సర్వేలో తేలింది. ఎమిరేట్స్ కు నాలుగు వేల కుటుంబాలు, ఆస్ట్రేలియాకు 3 వేల 500 మంది, సింగపూర్ కు 2 వేల ఎనిమిది వందల మంది వెళ్తున్నారు. అమెరికాకు వలసలు తగ్గాయని ఒక అంచనా. భారతీయులు వెళ్లి స్థిరపడటం కారణంగా ఆస్ట్రేలియా దేశ సంపద 70 నుంచి 80 శాతం పెరిగిందని సర్వేల్లో తేలింది. టెక్నాలజీ రంగంలో కష్టపడి సంపదను సృష్టించిన వాళ్లు ఎక్కువగా ఇండియాలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. పన్నులు, శాంతిభద్రతల వంటి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది దేశానికి మంచిదో కాదో ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి