కింగ్ నాగార్జున, కార్తి ల మల్టీస్టారర్ మూవీ ఊపిరి ఎంత సంచలన విజయం దక్కించుకుందో మనకు తెలిసిందే.. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి 2 మిలియన్స్ కు శరవేగంగా దూసుకుపోతుంది. అయితే యూ.ఎస్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఊపిరి సినిమా చూడబోయి అరెస్ట్ అయ్యారట. అదేంటి ఊపిరి సినిమా చూస్తే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే.. ఆ స్టూడెంట్స్ టికెట్ లేకుండా సినిమా చూస్తున్నారట అందుకే థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫోన్ చేయడం వారిని అరెస్ట్ చేయడం ఇవన్ని జరిగాయట.
సినిమా అలా టికెట్ లేకుండా చూస్తున్నందుకు గాను వారి మీద ఎలాంటి కేసు పెట్టకుండా కేవలం జరిమానా విధించి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారట. టెక్సాస్ లో జరిగిన ఈ సంఘటన ఆ విధ్యార్ధులు చదుకునే యూనివర్సిటీలో హాట్ టాపిక్ అయ్యిందట. ఇప్పటికే అక్కడ తెలుగు వారికోసం టికెట్ రేటుని కూడా తగ్గించి సినిమాలు రిలీజ్ చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.