రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరుక్కున్న భారత విద్యార్థులకు చుక్కలుకనిపిస్తున్నాయి. వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉంటే వారిని అక్కడ్నుంచి తరలించక ముందే భారత ప్రభుత్వం ఆ దేశానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. రష్యాలో వ్యాపార సంబంధాలు మెరుగుపర్చుకోవడం మాత్రమే కాదు రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉంది.
తమను కాపాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడి శాంతిని ఏర్పాటు చేయాలని అదే పనిగా మోడీని కోరిన ఉక్రెయిన్ దౌత్యవేత్తకు భారత సర్కార్ షాకిచ్చినట్లయింది. అయితే ఈ పరిణామాలు ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులకు పెద్ద గండంగా మారాయి. భారత్ ఉక్రెయిన్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవడంతో అక్కడి అధికారులు భారత విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలని చూడకుండా కాళ్లతో నెడుతున్నారు. తిండీ నీరు లాంటి సౌకర్యాల గురించి అసలు పట్టించుకోవడం లేదు. బాధితులమైన తమ వైపు ఉండకుండా రష్యాకు మద్దతు తెలుపుతున్న భారతీయులకు తాము ఎందుకు అండగా ఉండాలన్నట్లుగా ఉక్రెయిన్ సైన్యం వ్యవహరిస్తోంది.
దీంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. భారతప్రభుత్వం రోజుకు రెండు, మూడు విమానాలను నడుపుతోంది. కానీ కొన్ని వేల మంది ఇప్పటికీ బిక్కుబిక్కుమంటున్నారు. వారందర్నీ తీసుకొచ్చే వరకైనా కాస్త సంయమనం పాటించి ఉన్నట్లయితే.. ఇప్పుడు రష్యాలో వాళ్లు ఇబ్బందులు పడేవాళ్లు కాదుకదా అనే వాదన వినిపిస్తోంది. కానీ సామాన్యులు ఎంత చర్చించుకుండా ఇలాంటివి ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆలోచన చేయకపోతే అనుభవించాల్సిది మాత్రం ప్రజలే. ఇప్పుడు అదే జరుగుతోంది.