మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. జీడీపీలో ప్రభుత్వ అప్పులు 100 శాతానికి మించొచ్చని హెచ్చరించింది. దీర్ఘకాల అప్పుల అధిక రిస్కులను ఎదుర్కోవడానికి భారత్కు గణనీయమైన పెట్టుబడులు అవసరమని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఏడాది కాలం స్థూల దేశీయోత్పత్తి సమానమైన అప్పులను 100 శాతంగా భావిస్తారు. సమీప కాలంలో ప్రపంచ వృద్థి మందగమించడం ద్వారా భారత వాణిజ్యం ప్రభావితం కానుంది. సరఫరాలో లోపాలు తలెత్తడంతో కమోడిటీ ధరలు పెరుగొచ్చు.. దీంతో ఒత్తిడి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2005-06లో భారత జీడీపీలో అప్పులు 81 శాతంగా ఉండగా.. 2021-22 నాటికి 84 శాతానికి ఎగిశాయి. . ఆ తర్వాత 2022-23లో 81 వాతానికి తగ్గాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా అప్పులు చేస్తోందన్న విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటోంది. 2023 సెప్టెంబర్ ముగింపు నాటికి భారతదేశ మొత్తం అప్పులు రూ.205 లక్షల కోట్లకు చేరాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికం నాటికి రూ.200 లక్షల కోట్ల అప్పులున్నాయి. అంటే మూడు నెలల్లోనే ఐదు లక్షల కోట్ల అప్పులు చేసినట్లయింది.