ఇంద్రగంటి తో నాగచైతన్య ఓ సినిమా చేయడానికి `ఓకే` అన్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సివుంది. అయితే… అది ఇంకా ఇంకా ఆలస్యం అవుతోంది. చైతూ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ముందు `థ్యాంక్యూ` పూర్తవ్వాలి. ఆ తరవాత.. `బంగార్రాజు`కి కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. తరుణ్ భాస్కర్ చెప్పిన కథకు ఇటీవల ఓకే చెప్పాడు చైతూ. దాంతో ఇప్పుడు ఇంద్రగంటి సినిమా ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
చైతూకి కూడా ఇంద్ర గంటి సినిమాని స్కిప్ చేయాలని వుందని, ఏదోలా ఈ ప్రాజెక్టు నుంచి బయటపడిపోవాలనుకుంటున్నాడని టాక్. ఇంద్రగంటి తీసిన `వి` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు సుధీర్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు. దానిపై కూడా ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇంద్రగంటి ఎప్పుడు ఇచ్చినా డీసెంట్ హిట్లే ఇచ్చాడు. బ్లాక్ బ్లస్టర్ విజయాలేం అందివ్వలేదు. క్లాస్ దర్శకుడిగా ముద్ర పడిపోయింది.చైతూ ఇప్పుడు మాస్ కథల కోసం వెదుకుతున్నాడు. అందుకే ఇంద్రగంటికి సున్నితంగా `నో` చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడట. మొత్తానికి ఇంద్రగంటికి చైతూ హ్యాండిచ్చేసినట్టే కనిపిస్తోంది.