‘బిచ్చగాడు’తో సంచలనం సృస్టించాడు విజయ్ ఆంటోని. అనువాద సినిమాగా వచ్చిన ‘బిచ్చగాడు’ తెలుగులో కోట్ల వర్షం కురిపించింది. ఇప్పుడు విజయ్ ఆంటోని మరో సినిమాతో వస్తున్నాడు. అదే ‘ ఇంద్రసేన’. విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం. శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రాధిక శరత్ కుమార్, విజయ్ ఆంటోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకు రెడీగా వున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా పై ఆసక్తిపెరింది. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదిగా విడుదల అయినా ఈ లుక్ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన ట్రైలర్ టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.
ఇప్పుడీ సినిమా ప్రివ్యూ టాక్ కూడా పాజిటివ్ గా వుంది. వైవిధ్యమైన సినిమాని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే టాక్ బయటికి వచ్చింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బిచ్చగాడు తెలుగులో కాసుల వర్షం కురిపించింది. భాషతో సంబంధం లేకుండా సినిమా బావుంటే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారో ఈ సినిమా చూపించింది. ఈ సినిమాతో విజయ్ కి ఇక్కడ ఒక మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు ఇదే జోరు లో వస్తున్న ఇంద్రసేనపై కూడా మంచి అంచనాలే వున్నాయి. మరి ఆ అంచనాలను విజయ్ ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి.