దాసరి నారాయణరావు లాంటి పెద్ద మనిషిని ఈ రోజు పరిశ్రమ మిస్ అయ్యిందని వ్యాఖ్యానించారు బాలకృష్ణ. దాసరి భోళా మనిషని, ఆయన్ని చాలామంది వాడుకున్నారని, ఆయన కూడా చాలామందికి సహాయం చేశారని, 24 క్రాఫ్ట్ర్ కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయన లేని లోటుని కొంతవరకూ దాసరి శిష్యుడు సి.కల్యాణ్ తీరుస్తున్నాడని, ఇండ్రస్ట్రీ సమస్యలు కొన్నింటిని పరిష్కరించడానికి శ్రమిస్తున్నాడని కితాబిచ్చారు.
అయితే ఇక్కడో పాయింట్ ఉంది. దాసరి తరవాత ఆ స్థానంలో స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్న వ్యక్తి చిరంజీవి. ఓ రకంగా దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు చిరు. ఇండ్రస్ట్రీ లో ఓ వర్గం `దాసరి స్థానం చిరుతో భర్తీ అయ్యింది` అని బాహాటంగానే చెబుతున్నారు. ఈమధ్య అన్ని విషయాల్లోనూ తానై పరిశ్రమని ముందుండి నడిపిస్తున్నాడు చిరు. మొన్న కేసీఆర్ తో మీటింగ్‌కీ, ఇప్పుడు జగన్ తో భేటీకీ చిరంజీవినే సూత్రధారి, ప్రధాన పాత్రధారి. అలాంటప్పుడు… చిరు పేరెత్తకుండా, సి.కల్యాణ్‌ని గుర్తుపెట్టుకోవడంలో ఆంతర్యం ఏమనుకోవాలి? దాసరి స్థానం భర్తీ చేయలేనిదే. కాకపోతే.. చిరు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు కదా. అవన్నీ బాలయ్య కి కనిపించలేదా? లేదంటే చిరు పెద్దరికాన్ని బాలయ్య గుర్తించలేదా? మొత్తానికి బాలయ్య వ్యాఖ్యలు చిరు అభిమానులకు మింగుడు పడనివే.