హీరో నాగసౌర్య లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పేకాట క్లబ్ అంటూ సోమవారం అంతా జరిగిన రచ్చ వెనుక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో ఏపీ ఇంటలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే వారు ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఇచ్చారా లేక హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న తర్వాత సమాచారం తీసుకున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే నాగసౌర్య పేరు ఈ కేసును బాగా ప్రచారంలోకి తేవడానికి ఉపయోగపడింది కానీ అసలు టార్గెట్.. ఈ పేకాట క్లబ్ నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమాన్ అనే వ్యక్తినేనని అనుమానిస్తున్నారు.
గుత్తా సుమన్ కుమార్.. పేకాట క్యాంపులు నిర్వహించడంలో దిట్టని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఇటీవల మూత పడిన AP 24/7 న్యూస్ చానల్‌కు డైరక్టర్‌గా కూడా ఉన్నారు. అదే సమయంలో కొంత మంది మీడియా వ్యక్తులతో లావాదేవీల్లోనూ గొడవలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన వ్యవహారాలపై దృష్టి పెట్టి పట్టుకున్నారని చెబుతున్నారు. మాములుగా అయితే ఆ కేసును ఎవరూ పట్టించుకోరు.
కానీ సినిమా వాళ్లకు సంబంధించి ఏదైనా లింక్ ఉండే విస్తృతంగా ప్రచారం చేయవచ్చు.. ఈ క్రమంలోనే మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట క్యాసినో నిర్వహిస్తున్న తెలిసిన తర్వాత వెంటనే దాడి చేసి పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు కృష్ణుడు కూడా ఓ పేకాట డెన్‌లో దొరికిపోయారు. అయితే ఆయన నిర్వహిస్తున్నారా..లేకపోతే పాల్గొన్నారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ కేసు వివరాలు బయటకు రాలేదు. కానీ ఈ కేసు మాత్రం హైలెట్ అవుతోంది.