కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. ఈ కేసులో శిక్ష పడితే మ్యాగ్జిమం మూడున్నరేళ్లేనని కానీ తన కుమారుడు ఇంకా జైల్లోనే ఉన్నారని ఆయన తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కోడికత్తి శీనుకు బెయిల్ రాకుండా చేస్తోంది.. ఈ మొత్తం వ్యవహారంలో లబ్దిదారుడు అయిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డే. సానుభూతితో ఓట్లు దండుకున్నారు. అసలు అయిందో లేదో తెలియని గాయంతో రాజకీయం చేశారు. కానీ అందుకు వాడుకున్న యువకుడ్ని బలిపశువు చేశారు.
రంగం సినిమా కథే కళ్ల ముందు కనిపిస్తోంది !
రంగం సినిమా కథను గత ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఏపీ ప్రజలకు చూపించారు. ప్రజలు అంతా నిజమేనని అనుకున్నారు. కానీ ప్రతీది ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. కోడికత్తి శీనుకు కత్తి ఇచ్చింది బొత్స మేనల్లుడేనని.. బయటకు రావడం సంచలనం. అసలు ఈ కేసులో కుట్ర లేదని ఎన్ఐఏ చెబుతోంది కానీ… మొత్తం రాజకీయ కుట్ర ఉందని స్పష్టమవుతోంది. సామాన్య ప్రజలు కూడా ఏమి జరిగిందో అర్థం చేసుకుంటున్నారు. కానీ దర్యాప్తు సంస్థలు మాత్రం కళ్లు మూసుకున్నాయి.
జగన్ గాయానికి వైద్యం చేసిన డాక్టర్ కదా అసలు సాక్షి !
జగన్ కు గాయం అయిందో లేదో ఎవరికీ తెలియదు. ఆయన సాక్ష్యాలు ఏమీ ఇవ్వలేదు. రక్తం అయిన షర్టు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఇచ్చిన షర్టుకు చిరుగు లేదు. కానీ రక్తం మరకులు ఉన్నాయి. షర్టు చిరగకుండా ఎలా గాయం అవుతుందన్నది ప్రశ్నార్థకం. అంతేనా …. ఆయన హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో చేరారు. దాదాపుగా నెలరన్నర రెస్ట్ తీసుకున్నారు. తొమ్మి ది కుట్లు పడినట్లుగా ఆస్పత్రి నేరుగా మెడికల్ బులెటిన్లు విడుదల చేసింది. ఇంత కుట్ర జరిగినా ఎన్ఐ ఏ ఎందుకు దీన్ని తేలిగ్గా తీసుకుందన్నది స్పష్టత లేదు. జరగని దాడిని జిరగినట్లుగా క్రియేట్ చేశారా.. లేకపోతే… ఓ పకడ్బందీ ప్లాన్ ప్రకారం సానుభూతి కోసం మొత్తం డ్రామా చేశారా అన్నది తేలాల్సి ఉంది.
ఈ కేసు చేధిస్తే మరో రాజకీయ నాయకుడు ఇలాంటి డ్రామాలేయరు !
ఇక్కడ బాధితుడ్ని బయటకు రాకుండా జగన్ రెడ్డే అడ్డుపడుతున్నారు. ఆయన బ యటకు వస్తే నిజం తెలిసిపోతుందని అనుకుంటున్నారేమో కానీ అబద్దాన్ని కోర్టుల ద్వారా నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ… అసలు కుట్రను … జగన్ రెడ్డి వైద్యం రికార్డుల నుంచి ప్రారంభిస్తే.. అసలు తప్పుడు ప్రచారం ఎందుకు చేయాల్సి వచ్చింది.. తప్పుడు చికిత్స ప్రచారం ఎందుకు చేశారు.. కుట్లు వేయకుండా వేసినట్లుగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది.. ఈ కథ అంతా వెలుగులోకి వస్తుంది. అప్పుడే అసలు కుట్ర బయటపడుతుంది.
దళిత యువకుడు బలి కాకుండా కాపాడలేమా ?
ఓ దళిత యువకుడు ఈ మొత్తం రాజకీయ డ్రామాలో బలి అవుతున్నాడు, అతని తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. వారు స్వయంగా జగన్ రెడ్డి అభిమానులు. ఆ విషయం వైసీపీకీ తెలుసు. అయినా వారిని బలి చేయాలనుకుంటున్నారు. ఆ యువకుడ్ని కాపాడి… రాజకీయకుట్రల్ని బయటపెట్టలేమా ?