ఖైదీ నెం.150 సెన్సార్ అయిన దగ్గర్నుంచి ఈ సినిమా టాక్‌పై బయట రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా బాగా వచ్చిందని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే… `సినిమా అవుట్ పుట్‌పై చిరు ఏమాత్రం సంతృప్తిగా లేడ`ని మరో వర్గం ఊదరగొడుతోంది. మొత్తానికి అటు పాజిటీవ్ ఇటు నెగిటీవ్ టాక్ మధ్య ఖైదీ నెం.150 ఊగిసలాడుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఖైదీ నెం.150 ఒర్జినల్ అవుట్ పుట్ ఏంటన్న విషయాన్ని ఆరా తీసింది తెలుగు 360.
ఈ సినిమా చిరు ఫ్యాన్స్‌కి నచ్చేలా తీయడంలో వినాయక్ విజయవంతం అయినట్టు టాక్. చిరుని చూసి ఫ్యాన్స్ కూడా షాకయ్యేలా ఆయన మేకోవర్ ఉండబోతోందని, చిరు కోసమైనా ఈ సినిమా చూడాలి అన్నట్టుగా ఖైదీ నెం.150ని తీర్చిదిద్దారని తెలుస్తోంది. చిరు ఎంట్రీ సీన్, 3 పాటలూ, ఇంట్రవెల్ బ్యాంగ్.. ఇవన్నీ చాలా బాగా వచ్చాయని, ఖైదీ నెం.150కి ఇవే ప్లస్ పాయింట్స్ అని తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి పంచ్‌లు బాగా పేలాయని, బ్రహ్మానందం పాత్రని మరోసారి బకరా చేసేశారని, ఈ సినిమాలో బ్రహ్మీ వినోదం అంతంత మాత్రంగానే పండిందని తెలుస్తోంది. క్లయిమాక్స్ వీక్‌గా ఉందని టాక్. అయితే మిగిలిన సినిమా అంతా చిరు తన చరిష్మాతో నడిపించేశాడని, స్టెప్పులైతే ఇక చూసుకొనే పనే లేదని ఈ సినిమా ఆల్రెడీ చూసినవాళ్లు చెబుతున్నారు. ఇంద్ర టైమ్‌లో చిరు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అంతకంటే బాగున్నాడని, చిరు చరిష్మానే ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సో… చిరు ఫ్యాన్స్‌కి ఇది సూపర్ న్యూసే కదా??