నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా.. గౌతమి పుత్ర శాతకర్ణి. సంక్రాంతి సంబర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా పూర్తి కావొచ్చింది కూడా. రెండు పాటలు, ఓ ఎపిసోడ్ తప్ప… సినిమా పూర్తయ్యింది. డిసెంబరు 20 నాటికి ఫస్ట్ కాపీ సిద్దం చేయాలని చిత్రబృందం గట్టిగా కృషి చేస్తోంది. అప్పటికి సీజీ, ఆర్.ఆర్, డీ.ఐ వర్క్స్‌ని పూర్తి చేయాలని భావిస్తోంది. డిసెంబరు 20 కంటే ముందే ఆడియో ఫంక్షన్‌ని జరపాలని క్రిష్ భావిస్తున్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.. వీటిలో ఓచోట ఆడియో వేడుక నిర్వహిస్తారట. అమరావతిలో ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొన్నా.. ఆ ప్రతిపాదనని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మూడు యుద్ద సన్నివేశాలు, ఆరు పాటలూ ఉన్నాయి ఈ చిత్రంలో. ఒకొక్క యుద్ద సన్నివేశం దాదాపు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకూ ఉంటుందట. సినిమా నిడివి విషయంలోనూ క్రిష్ జాగ్రత్తగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 గంటల 20 నిమిషాలు మించకూడదని క్రిష్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ ఎడిట్ వర్క్ చేసి చూసుకొన్నారని, సినిమా సంతృప్తిగా వచ్చిందని తెలుస్తోంది. దానికి సీజీ వర్క్ యాడ్ అయితే.. మరో స్థాయిలో ఉండబోతోందని చిత్రబృందం సంబర పడుతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తి అవ్వడం క్రిష్ ని సంతోష పెట్టే విషయమే. మరోవైపు బాలయ్య సెకండాఫ్ డబ్బింగ్‌ని ఈరోజే మొదలెట్టినట్టు తెలుస్తోంది. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే.. సంక్రాంతికి ఈసినిమా విడుదల చేయడం. అందుకే ఇంత టీమ్ మొత్తం ఇంత స్పీడ్‌గా ఉంది.