స్మార్ట్ ఫోన్ మాయలో పడి పిల్లలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ ఆ స్మార్ట్ ఫోన్ మాయలో పడి జీవితం అంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే అత్యంత క్రూరమైన హత్యలు చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితులు ఇప్పుడు వచ్చేశాయి. హైదరాబాద్ శివారులో జరిగిన ఓ ఇంటర్ విద్యార్థి హత్య ఉదంతం మొత్తం స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది. స్మార్ట్ ఫోన్ కోసం.. ఓ ఇంటర్ విద్యార్థి .. తన స్నేహితుడ్ని అత్యంత దారుణంగా హత్య చేసి .. పెట్రోల్ పోసి తగులబెట్టాడు. స్మార్ట్ ఫోన్ తీసుకుని.. ఏదో సాధించినట్లు మూడు రోజులు సంతోషంగా గడిపాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ లో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ప్రేమ్ అనే ఇంటర్ విద్యార్థి కథ విషాదాంతం అయింది. ఆదిభట్ల వద్ద.. పూర్తిగా కాలిపోయిన విద్యార్థి మృతదేహం దొరకింది. హత్య చేసి తగులబెట్టారని పోలీసులు గుర్తించారు. ప్రేమ్ తల్లిదండ్రులు.. అది తమ కుమారుడి మృతదేహమేనని గుర్తించారు. అంతకు ముందే వారు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ గొడవల జోలికే పోని.. ప్రేమ్‌ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న విషయంపై పోలీసులు కూపీ లాగడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ప్రేమ్ కొద్ది రోజుల క్రిందట… ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నారు. దాన్ని తన స్నేహితుడు సాగర్ కి చూపించాడు. స్మార్ట్ ఫోన్ ను చూసి ముచ్చటపడిన సాగర్..తనకు ఫోన్ ఇవ్వాలని కోరాడు. ప్రేమ్ తిరస్కరించాడు. అప్పటికి సైలెంట్ గా ఉన్న… సాగర్ … మూడు రోజుల కిందట.. లాంగ్ డ్రైవ్ కి వెళ్తామని… ప్రేమ్‌ని బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. శివారు ప్రాంతంలోని ఆదిభట్ల వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..హత్య చేశాడు. తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టాడు. స్మార్ట్ ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు.
సీసీ టీవీ ఫుటేజీల్లో.. ప్రేమ్ ని సాగర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించడంతో కేసును పోలీసులు ఓ కొలిక్కి తీసుకురాలిగారు. కానీ ఆ కుర్రాడే స్నిహుతుడ్ని హత్య చేశాడని… పోలీసులు ఊహించలేకపోయారు. పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి ప్రశ్నలు వేయడంతో భయపడిపోయిన సాగర్ .. నిజాలు చెప్పేశాడు. స్నేహితుల్ని కూడా.. చంపగలిగేంత కసిని… పూర్తిగా ఎదగని పిల్లల బుర్రల్లో స్మార్ట్ ఫోన్ కలిగిలిస్తోంది. ఇది వాడకంతో వచ్చే ఉపద్రవమే కాదు.. దాన్ని సొంతం చేసుకోవాలనుకునే ఆశతో కూడా..