ఆర్.ఆర్.ఆర్తో పులితో తలపడ్డాడు ఎన్టీఆర్. ఆ సీన్… సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటి సీన్ ఒకటి.. `పుష్ప 2`లో ఉండబోతోంది. అటవీ నేపథ్యంలో సాగే కథ పుష్ష. అందుకే అలాంటి సీన్ కి ఛాన్స్ దొరికింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలన్నీ ఇప్పుడు సీజీల్లో ఈజీగా అయిపోతున్నాయి. పులిని తీసుకురావాల్సిన పనేలేదు. కాకపోతే… సుకుమార్ శైలి వేరు కదా..? ఆయన గ్రాఫిక్స్ కంటే రియాలిటీకే పెద్ద పీట వేస్తారు. కాబట్టి.. నిజమైన పులిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ బ్యాంకాక్‌లో ఉంది. అక్కడ లొకేషన్ల కోసం రెక్కీ చేస్తున్నార్ట. బ్యాంకాక్‌లో కొన్ని చోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి. అక్కడ.. ఈ పులితో ఫైటింగ్ సీన్ డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. విదేశాల్లో ఫ్రెండ్లీ యానిమల్స్ ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతుంటారు. అలాంటి ట్రైనీ టైగర్‌తో పుష్ప2 ఫైట్ సీన్ ని డిజైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసం.. అల్లు అర్జున్‌కి సైతం ప్రత్యేకమైన తర్ఫీదు అందిస్తున్నార్ట. ఎంత సీజీల్లో సీన్ మొత్తం తీసేసినా… రియల్ టైగర్ ని సినిమాల్లో చూపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం సుకుమార్ కూడా అదే ప్లాన్ లో ఉన్నాడు.