విజయ్ దేవరకొండ – పూరిల సినిమా ‘లైగర్’పై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకొంది. ఈ సీజన్లో విడుదల కానున్న పెద్ద సినిమా ఇదే. పాన్ ఇండియా వ్యాప్తిగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వరుస పరాజయాల పరంపరకు `లైగర్` బ్రేక్ వేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకొన్నాయి.
మరోవైపు.. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మైక్ టైసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మైక్ టైసన్కీ ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? తను అసలు ఈ కథలోకి ఎలా వస్తాడు? అనే ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ.. మైక్ టైసన్ అభిమానిగా కనిపించబోతున్నాడట. టైసన్‌తో ఎప్పటికైనా ఓ సెల్ఫీ తీయించుకోవాలన్నది `లైగర్` డ్రీమ్. అంతటి అభిమాని అయిన లైగర్.. చివరికి క్లైమాక్స్ పోరులో.. టైసన్తోనే తలపడి, తనని అంతమొందిస్తాడు. నిర్జీవంగా పడుకొన్న టైసన్‌ని ఒళ్లొ పడుకోబెట్టుకొని.. అప్పుడు ఓ సెల్ఫీ తీసుకుంటాడట హీరో. అలా.. తన కలని నిజం చేసుకుంటాడు. ఇందులో మదర్ సెంటిమెంట్ ని కూడా బలంగా చూపించబోతున్నాడట పూరి. ఇది వరకు `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`లో మదర్ సెంటిమెంట్ పండింది. అది కూడా బాక్సింగ్ కథే. అందుకే ఈ రెండు సినిమాలకూ పోలిక తీసుకొస్తున్నారు సినీ అభిమానులు.