చిరంజీవి, వశిష్ట సినిమా ప్రారంభమైంది. సోషియా ఫాంటసీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. పంచభూతాలు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కాన్సెప్ట్ పోస్టర్ లో రివిల్ చేశారు. సినిమా థీమ్ కి తగ్గట్టే ఒక పవర్ఫుల్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట ముల్లోకాల వీరుడు అనే టైటిల్ అనుకున్నారు. కథకు ఈ టైటిల్ సరిపోతుంది కానీ టైటిల్ లో డబ్బింగ్ సినిమా సౌండింగ్ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడా టైటిల్ ప్లేస్ లో మరో టైటిల్ వచ్చింది. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ అనుకుంటున్నారని తాజా సమాచారం.
విశ్వంభర అనగానే సాహితీ ప్రియులకు సి నారాయణ రెడ్డి రచన గుర్తుకువస్తుంది. విశ్వంభర అనే పదానికి భూమి, అతేంద్రియ శక్తి, శ్రీ మహావిష్ణు.. ఇలా కొన్ని విశేషమైన అర్ధాలు వున్నాయి. వశిష్ఠ రాసుకున్న కథకు ఈ టైటిల్ సరిగ్గా నప్పుతుందని, మెగాస్టార్ ఇమేజ్ కి కూడా ఈ టైటిల్ సరిపోతుందని యూనిట్ భావిస్తోంది. దాదాపు ఈ పేరే ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయి లో ఈ సినిమా ని రూపోందిస్తున్నారు. అన్ని భాషల్లో ఇదే టైటిల్ వుండే ఛాన్స్ వుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్.