2024లో నందమూరి బాలకృష్ణ నుంచి సినిమాలేం రాలేదు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. అయితే అన్ స్టాపబుల్ తో.. ఫ్యాన్స్ ని కాస్త సంతృప్తి పరచగలిగారు బాలయ్య. 2025 సంక్రాంతి సీజన్లో బాలయ్య హంగామా కనిపించబోతోంది. ఆయన డాకూ మహారాజ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ సినిమా గురించి అటు నిర్మాత నాగవంశీ, ఇటు దర్శకుడు బాబీ చాలా గొప్పగా చెబుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే… అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.
డాకూ మహారాజ్ ని ఇంత వరకూ యాక్షన్ మూవీగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో ట్విస్టులు ధ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయట. సినిమా మొత్తమ్మీద మూడు ట్విస్టులు ఉంటాయని, అవన్నీ కథని కొత్త కోణంలో చూపించబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పాప క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ పాప ఎవరు? అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ఆ పాప ఎవరన్న విషయాన్ని రివీల్ చేయడమే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం. బాలయ్య పాత్రలో భిన్నమైణ కోణాలు ఒకొక్కటిగా బయటకు రావడం కూడా చాలా ధ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికి ఈ సినిమా నుంచి 2 పాటలు వచ్చాయి. మూడో పాట జనవరి 4న రాబోతోంది. ఆ పాట మాస్కు బాగా నచ్చేలా ఉండబోతోందని, ఇందులో బాలయ్య వేసే స్టెప్పులు.. కొత్త పంధాలో ఉంటాయని తెలుస్తోంది. రెండు పాటల్లో బాలయ్యలో ఎనర్జీ చూసే అవకాశం రాలేదు. మూడో పాట ఆ లోటు తీర్చబోతోందన్నమాట.