జగన్మోహన్ రెడ్డి సర్కార్ .. ఎవరికైనా డబ్బులు బాకీ ఉంటే ఇవ్వకపోయినా పర్వాలేదనుకుంటోంది. అది చిన్న కాంట్రాక్టర్లైనా.. అంతర్జాతీయ సంస్థలైనా సరే. ప్రస్తుతం మరో అంతర్జాతీయ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తమ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని తెలిపింది. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ను డిజైన్లను ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ డిజైన్ చేసింది. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. ఎన్ని సార్లు అడిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆ కంపెనీ ప్రతినిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
మధ్యవర్తిత్వం కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించింది. అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని జగన్ పక్కన పెట్టారు. నిర్మాణాలు నిలిపివేశారు. కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా… పోస్టర్ కంపెనీ నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అమరావతిని నిలిపివేస్తే ఆ మేరకు ఇక నార్మన్ ఫోస్టర్ సేవలు అవసరం లేదని చెప్పి సెటిల్ చేసుకోవచ్చు . కానీ ఏపీ ప్రభుత్వం అలా వదిలేస్తే కోర్టుకు పోతే.. తమకు పోయేదేముంది.. కోర్టు చెబితే ఇస్తాం. లేకపోతే లేదన్నట్లుగా ఉటున్నారు. కానీ ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న సంగతిని మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఏపీ పరువు పోతే తనకేం అనే భావనలో పాలకులు ఉన్నట్లుగా కనిపిస్తోంది.