సినిమాల్లో..వెబ్ సీరిస్లలో డ్రగ్స్ వ్యవహారాలను చూస్తున్నప్పుడు అబ్బో ఇలా జరుగుతుందా.. ఇంత నెట్ వర్క్ ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతూంటారు.. కానీ అలాంటివి ఉన్నాయని.. మన కళ్ల ముందు జరిగే పరిణామాలు చూస్తే రియాలిటీలోకి రావాల్సి ఉంటుంది. విశాఖ పోర్టులోకి ఏకంగా పాతిక వేల కేజీల కొకైన్ రావడం అంటే చిన్న విషయమా ?. ఒక్క గ్రామ కొకైనా పదిహేను వేల రూపాయలకు అమ్ముతారు. అలాంటిది పాతిక వేల కేజీలు వచ్చింది. ఎన్ని వేలకోట్లు ఉంటుందో అంచనా వేయడం కష్టం.
ఆ డ్రగ్స్ మొత్తాన్ని ఎక్కడ ప్రాసెస్ చేస్తారు.. ఎవరికి అమ్ముతారు.. ఎలా ట్రాన్స్ పోర్టు చేస్తారన్నది ఎవరికీ తెలియని ఓ నెట్ వర్క్. అత్యంత కీలకం. ఈ నెట్ వర్క్ ను ఆపరేట్ చేసే వాళ్లు ఏపీలోనే ఉన్నారని తాజాగా స్పష్టమయింది. డ్రగ్ డీలర్లు ఇంత పెద్ద మొత్తంలో ఓ చోటకు డ్రగ్స్ పంపరు. ఎంతో సేఫ్…. అనుకుని.. చిన్న మొత్తాల నుంచి పెంచుకుంటూ పోతారు. అంత సేఫ్ అనిపించేలా పోర్టు నుంచి ఎవరికీ దొరకకుండా దిగుమతులు చేసుకోవడం ద్వానే ఇది సాధ్యం. ఇప్పుడు అదే జరిగింది. పెద్ద ఎత్తున ఈ పోర్టు నుంచి బ్రెజిల్ నుంచి సరుకు దిగుమతి అవుతోంది. అంతర్జాతీయ ముఠా.. విశాఖ లో క్యాంప్ పెట్టుకుని మరీ… డ్రగ్స్ వ్యవహారాలను నడుపుతోందన్నమాట.
సాధారణంగా అధికార వర్గాలు … గట్టిగా ఉంటే.. గంజాయి మొక్క కూడా బయటకు పోకూడదు. కానీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారి వ్యవహారశైలిపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు గంజాయి వ్యాప్తికి కారణంగా ఏపీని చూపించాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా వేల కిలోలు సరుకు బయటపడిది. ఇప్పుడు సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులు అత్యవసరంగా … ఈ డ్రగ్ రాకెట్ ను చేధించాల్సి ఉంది. ఎన్ని సార్లు తెప్పించారు.. ఎక్కడ ప్రాసెస్ చేశారు… ఎలా బయటకు వెళ్లాయి.. ఎవరు సహకరించారో తేలిస్తే కానీ దేశం డ్రగ్స్ మహమ్మారి గుప్పిట నుంచి బయటపడదు .