రాయిటర్స్, గల్ఫ్ న్యూస్, బిజినెస్ వరల్డ్, లైవ్ మింట్… ఇలా అంతర్జాతీయ పేరెన్నిక గన్న వార్తా సంస్థల్ని కూడా… విజయసాయిరెడ్డి పచ్చ మీడియా ఖాతాలో వేసేశారు. కియా మోటర్స్ తన ప్లాంట్ను తమిళనాడుకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందన్న ఖచ్చితమైన సమాచారం.. చర్చల సారాంశం దొరికిన తర్వాతనే.. ఆయా సంస్థలు.. విషయాన్ని బయటకు ప్రకటించాయి. ఇది అంతర్జాతీయ వార్త. అందుకే.. అంత ప్రాధాన్యం ఇచ్చాయి. బిలియన్ డాలర్ల పెట్టుబడి.. పెట్టిన చోట నుంచి.. అభద్రతతో ఓ దిగ్గజ పరిశ్రమ.. ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లే ఆలోచన చేస్తోందంటేనే.. చిన్న విషయం కాదు. అందుకే.. జాతీయ, అంతర్జాతీయ మీడియా .. ప్రముఖంగా ప్రసారం చేశాయి.
కానీ.. ఈ వార్తల్ని పచ్చ మీడియా వార్తలుగా కొట్టి పారేస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా.. విజయసాయిరెడ్డి ఈ విషయంలో.. చాలా దూకుడుగా ఉన్నారు. తమకు వ్యతిరేకంగా.. ఇష్టం లేని వార్తలు ఎవి వచ్చినా.. పచ్చ మీడియా అంటూ.. విమర్శించడం వారికి అలవాటే. కానీ ఇప్పుడు.. రాయిటర్స్ లాంటి సంస్థల్ని కూడా.. ఈ పచ్చ మీడియా ఖాతాలో వేయడం.. ఆయన … వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు.. అక్కడి మీడియాకు తెలియదు. వ్యాపార ప్రపంచంలో ఓ సంచలనాన్ని మాత్రమే.. అవి బయట పెట్టాయి.
ఈ వార్తలు అవాస్తవాలని ప్రభుత్వం తరపున ప్రకటన వచ్చింది. కియాతో కలిసి పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కియా స్థానిక ప్రతినిధులతోనూ అలాంటి ప్రకటనలే చేయించారు. అయితే.. కియా కొరియా యాజమాన్యం.. తమిళనాడు ప్రభుత్వంతో.. సంప్రదింపులు జరుపుతోందనేది.. ఖచ్చితమైన విషయంగా.. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఆగవని.. వాచ్చే వారం.. కార్యదర్శల స్థాయిలో చర్చలు జరుగుతాయంటున్నారు. అప్పటి వరకూ… అవాస్తవాలని… ప్రజల్ని నమ్మించడానికి అంతర్జాతీయ వార్తా సంస్థల్ని కూడా పచ్చ మీడియా ఖాతాలో వేస్తున్నారు వైసీపీ నేతలు.