యూత్ ఫుల్ హిట్స్ తనకంటూ అభిమానులని సంపాయించుకున్నాడు రాజ్ తరుణ్. వరుసగా మూడు విజయాలతో ప్రామెసింగ్ హీరో అనిపించుకున్నాడు. అయితే తర్వాత కొన్ని అపజయాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్ళీ తనకు అలవాటైన జోనర్ లో మరో బంగారంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే.. అనుభవించు రాజా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ వారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాజ్ తరుణ్ పంచుకున్న సినిమా ముచ్చట్లు..
బంగారం క్యారెక్టర్ ఎలా అనిపించింది ?
కథ చెప్పినప్పటి నుంచి ఈ సినిమా పాత్రని ఎంజాయ్ చేశా. చేసినప్పుడు కూడా భలే అనిపించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.
భీమవరం షూటింగ్ ఎలా అనిపిచింది ?
నా కెరీర్ సగం సినిమాలు అక్కడే చేశా. అక్కడ మనుషులు, ఫుడ్ బావుంటుంది. సరదాగా గడిచిపోయింది.
బంగారం పాత్ర మీ రియల్ పాత్రకు దగ్గరగా వుంటుందా ?
అస్సల్ వుండదు. పూర్తి భిన్నంగా వుంటుంది.
సెక్యురిటీ గార్డ్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ?
అమ్మో చాలా కష్టం. డానికి చాలా సహనం కావాలి. పొద్దున్న మన గేట్ తీసేది సెక్యురిటీ, రాత్రి గేట్ వేసిది సెక్యురిటీ. వాళ్ళు నవ్వుతూ పనిచేస్తే మన డే బావుంటుంది. అలా నవ్వుతూ ఆ జాబ్ చేయడం అంత ఈజీ కాదు.
శ్రీనివాస్ గవిరెడ్డితో రెండో సినిమా. ఎలాంటి అనిపిచింది ?
శ్రీనివాస్ నా బెస్ట్ ఫ్రండ్, సీతమ్మ అందాలు … సినిమా చేసినప్పుడు కుర్రాడు. ఇప్పుడు చాలా మెచ్యురిటీ వచ్చింది.చాలా నెమ్మది వచ్చింది. సినిమాని అర్ధం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికి స్పష్టమైన తేడా కనిపించింది,
కథ చెప్పినపుడు ఎలా అనిపిచింది ?
కథ ఒక్కసారిగా చెప్పలేదు. రాస్తున్న ప్రతి సీన్ చెప్పేవాడు. అన్నపూర్ణలో నాగార్జున, సుప్రియగారికి నచ్చింది. హీరో ఎవరు అంటే శ్రీను నా పేరు చెప్పడం. అలా ఓకే అయ్యింది.
హీరోయిన్ గురించి ?
తెలుగు రాకపోయిన చాలా బాగా నేర్చుకొని సొంతగా డైలాగులు చెప్పడానికి ప్రయత్నించింది. మంచి మనిషి. చాలా ప్రశాంతంగా వుంటుంది.
సినిమా ఎలా ఉండబోతుంది ?
అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఫ్యామిలీ, ఫాదర్ సన్, విలేజ్ ఎమోషన్స్ అన్నీ బలంగా వుంటాయి.
సినిమాలో వినోదం మీ పాత్రలోనే వుంటుందా ?
లేదు, పోసాని, సుదర్శన్, అజయ్ ఇలా చాలా మంది వున్నారు, అన్నీ పాత్రల్లో ఫన్ వుంటుంది.
ట్రైలర్ చూస్తే కోడి పందాలు ఎలిమెంట్ కనిపించింది. మీరు రియల్ లైఫ్ లో పందాలు వేశారా ?
లేదు. బెట్టింగులు, గ్యాబ్లింగ్ జోలికి వెళ్లను. కానీ సంక్రాంతి కోళ్ళ పందాలు చూశాను. మా సినిమాలో సంక్రాంతి వుంది. ఈ సినిమాలో కోడిని షూటింగ్ కోసం తీసుకొచ్చాం. షూటింగ్ అయిపోయాక ఇంటికి తీసుకెళితే అది తినడం లేదని చెప్పారు. బహుశా డానికి కూడా షూటింగ్ అలవాటైపొయిందేమో (నవ్వుతూ)
కొన్ని ప్రయోగాలు చేశారు. మళ్ళీ పాత జోనర్ కి వచ్చారు. సేఫ్ గేమ్ అనుకోవచ్చా ?
లేదు. మనం అదీ ఇదీ అని లెక్కలు వేసుకుంటే వర్క్ అవుట్ కాదు. కథ బావుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
వరుసగా మూడు హిట్లు వచ్చాయి. కానీ తర్వాత ఆ సక్సెస్ నిలబెట్టుకోలేకపోయారా ?
కాదు. హైదరాబద్ ఎలా రావాలో కూడా తెలీదు నాకు. అలాంటింది ఇది నా 14వ సినిమా. ఇంతకంటే పెద్ద విజయం ఏం వుంటుంది. రియల్లీ లక్కీ నేను,
కొత్త సినిమా కబుర్లు ?
స్టాండప్ రాహుల్ రెడీ అవుతుంది. మాస్ మహారాజా సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. ఇంకొన్ని కధలు వింటున్న.
ఆల్ ది బెస్ట్
అల్ ది బెస్ట్ థ్యాంక్ యూ