అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ విడుదలకు సిద్దమైయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్, యాక్షన్ థ్రిల్లర్ డిసెంబరు 17న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీబిజీగా వుంది. ఇందులో బాగంగా హీరోయిన్ రష్మిక మందన ‘పుష్ప’ సినిమా సంగతులు పంచుకుంది. ఆ విశేషాలు ఇవే…
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మీ మాటలు వింటే బన్నీతో మీ కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు అనిపించింది?
కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం వుంది. బన్నీ అద్భుతమైన కో స్టార్. బన్నీతో వంద సినిమాలు చేయడానికైన సిద్దం. నటన పట్ల అతని అంకిత భావానికి హ్యాట్సప్.
మేకప్ లేకుండా డీ గ్లామర్ రోల్ చేశారు ? ఎలా అనిపించింది ?
ఇంతకుముందు డియర్ కామ్రేడ్ లో విత్ అవుట్ మేకప్ చేశా. కానీ పుష్ప కంప్లీట్ రా ఫిల్మ్. పుష్ప కోసం ఒక ప్రపంచం సృష్టించారు సుకుమార్. పాత్రలు, ప్రదేశాలు ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
శ్రీవల్లి పాత్ర ఎలా వుంటుంది ?
శ్రీవల్లి చాలా కన్నింగ్ అండ్ ఫన్. మీరే చూస్తారు.
అల్లు అర్జున్ మీ పేరుని క్రష్మిక అని మార్చినట్లు వున్నారు?
అవును. సెట్ లో కూడా క్రష్మిక అని సరదా పిలుస్తారు.
గీత గోవిందం సమయంలో అల్లు అర్జున్ తో కలసి నటించాలని వుందని కోరుకున్నారు. ఇప్పుడా ఛాన్స్ వచ్చింది ఎలా అనిపిస్తుంది ?
చాలా గర్వంగా వుంది. నటిగా ఎదిగా అనిపించింది. ఎదిగినప్పుడే పెద్ద అవకాశాలు వస్తాయి. అల్లు అర్జున్ సినిమాలో పని చేసి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నా. చాలా గొప్పగా, అదే సమయంలో ఆనందంగా వుంది.
బన్నీతో మొదటి రోజు షూట్ ఎలా అనిపించింది ?
మొదటి రోజు చాలా టెన్షన్ పడ్డా. ఆ సంగతి ఆయనకి చెప్పా. ” ఎదుటివాళ్ళ ట్యాలెంట్ గురించి ఎక్కువ అలోచించకు. ఈ రోజు ఇక్కడ వున్నావ్ అంటే దానికి కారణం నీ ట్యాలెంట్. నీ పాత్రకి ఏం చేయగలవో దానిపై ద్రుష్టి పెట్టు” అన్నారు. ఈ మాట నా భయాన్ని ఒక్కసారికి పోగొట్టుంది. అప్పటి నుండి భయాల్ని పక్కన పెట్టి శ్రీవల్లి పాత్రకి ఎలా న్యాయం చేయాలనే అంశంపైనే ద్రుష్టి పెట్టా.
బన్నీతో డ్యాన్స్ చేయడం కష్టం. మీకు ఎలా అనిపించింది ?
బన్నీతో చేయలేదు. పుష్పతో చేశా. (నవ్వుతూ) సామీసామీ పాట బాగా నచ్చింది. అందులో వున్నది నేనేనా అని నమ్మలేకపోతున్నా.
శ్రీవల్లి పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?
సుకుమార్ గారు నాకు పూర్తి కధ చెప్పలేదు. నాకే కాదు.. సినిమాలో చాలా మందికి పూర్తి కధ తెలీదు. కానీ మొదట ఆయన చిత్తూరు యాస నేర్చుకోమన్నారు. తర్వాత మూడు సార్లు లుక్ టెస్ట్ చేసి.. లుక్ ఫైనల్ చేశారు. సెట్స్ లో బాడీ లాంగ్వేజ్ పై ఒక అవగాన వచ్చింది. మొదటి పార్ట్ లో శ్రీవల్లి పాత్ర ఒక టీజర్ లా వుంటుంది. రెండో బాగంలో పూర్తి శ్రీవల్లి కనిపిస్తుంది.
కధలు ఎంచుకోవడంలో ఏదైనా వ్యూహం పాటిస్తారా ?
లేదు. కధ బావుంటే .. ప్రెజెంట్ కి అది కరెక్ట్ స్క్రిప్ట్ అనిపిస్తే.. ఓకే చేసేస్తా.
సమంత ఐటెం సాంగ్ ఎలా అనిపించింది ?
మైండ్ బ్లోయింగ్. పాట చూసి సమంతకి మెసేజ్ పెట్టా. సమంత సూపర్ స్టార్. నాకు ఇష్టమైన హీరోయిన్.
బాలీవుడ్ ప్రయాణం ఎలా వుంది ?
చాలా మంచి పరిశ్రమ. మంచి మనుషులు. నా రెండు సినిమాలకి మంచి దర్శకులు దొరికారు. నా నటన వాళ్ళకి నచ్చింది.
బిగ్ బి తో నటించడం ఎలా అనిపించింది ?
భయంగా వుండేది. నటించేటప్పుడు కాదు కానీ కట్ చెప్పేసిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడాలంటే ఏదో తెలియని భయం. నిజంగా.. వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.
కొత్త సినిమాలు గురించి ?
కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే పరిశ్రమ ఓపెన్ అయ్యింది. రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా. షూటింగ్ లో వున్నవి కాకుండా ఇటివలే ఓ తెలుగు సినిమా సైన్ చేశా. త్వరలోనే వివరాలు చెప్తా.
అల్ ది బెస్ట్..
థ్యాంక్ యూ..