హారర్ కామెడీ హావా కొనసాగుతోంది. ఇది వరకు కొత్త హీరోలు, చిన్నా చితకా సినిమాలే ఈ జోనర్‌ని నమ్ముకొనేవి. ఇప్పుడు మినిమం రేంజు హీరోలూ ఈ జోనర్‌కి ఎట్రాక్ట్ అవుతున్నారు. అల్లరి నరేష్ కూడా హారర్ కామెడీలో లెగ్గు పెట్టాడు. నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్‌ని విడుదల చేశారు. నరేష్ సినిమా అంటే కామెడీ కంపల్సరి. దానికి హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేశారు. ఇప్పటి వరకూ వచ్చిన హారర్ సినిమాలకూ దీనికీ పెద్ద తేడా లేదన్న విషయం అర్థమైపోతోంది. కాకపోతే.. ”ఓం శాంతి.. విజయ శాంతి.. డిస్కో శాంతి” అంటూ.. నరేష్ టైపు కామెడీ సీన్లు, పంచ్‌లు పండితే… వర్కవుట్ అయిపోయే అవకాశం ఉంది.
దానికి తోడు రాజేంద్ర ప్రసాద్, చలపతిరావు, షకలక షంకర్, ప్రభాస్ శీను, జబర్ దస్త్ బ్యాచ్ వీళ్లంతా ఉన్నారు కాబట్టి నవ్వులకు కొదవ లేదనుకోవొచ్చు. జి. నాగేశ్వరరెడ్డికి కామెడీలో పట్టుంది. బివిఎస్ఎన్ ప్రసాద్‌కి ప్రొడక్షన్ వాల్యూస్ తెరపై కనిపిస్తున్నాయి. కామెడీ, హారర్కే పరిమితం అయిపోకుండా నరేష్, కృతికపై లవ్ ట్రాక్ కూడా నడిపారు. సో… అదనపు హంగుల విషయంలో కొరత లేదు. ఈమధ్య నరేష్ విజయాల్లేక అల్లాడిపోతున్నాడు. ఈ దశలో వస్తున్న ఈ క్రైమ్ కామెడీ.. నరేష్‌ని ఎంత వరకూ గట్టెక్కిస్తుందో చూడాలి.