ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తొలి పద్దులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విలక్షణత చూపారు. ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అంటూ.. ప్రభుత్వం చేసే ఖర్చుల మధ్య ఉన్న గీతను చెరేపిసి.. ప్రణాళికేతర వ్యయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ… అనుత్పాదక వ్యయం కాదని.. అది కచ్చితంగా మానవ వనరుల పెడుతున్న పెట్టుబడిగా.. చూపించారు. అన్ని వర్గాలు, అన్ని వయసుల వారికీ సంక్షేమ పథకాలు అందేలా.. నిధులు కేటాయించారు. వీటిలో ఎక్కువగా నగదు బదిలీ పథకాలు ఉన్నప్పటికీ… అవన్నీ మానవ వనరులపై ఏపీ పెడుతున్న పెట్టుబడిగానే… వర్గీకరించడం.. బుగ్గన చాతుర్యానికి తార్కారణం.
ఏపీకి మంచి భవిష్యత్ ఇవ్వబోతున్న విద్యారంగంపై పెట్టుబడి..!
“తల్లిదండ్రులు.. పిల్లలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు. కానీ మంచి చదువు మాత్రం చెప్పించండి..” అని మేధావులు సలహాలు ఇస్తూ ఉంటారు. జీవితంలో ఓ స్థాయికి చేరిన తర్వాత తల్లిదండ్రులకైనా ఇదే అనిపిస్తోంది. అప్పట్లో పిల్లల చదువు మీద మరికొంత పెట్టుబడి పెట్టి ఉంటే.. వారికి మంచి చదువు చెప్పించగలిగేవారమని… వారికి ఉన్న తెలివితేటలకు ఇప్పుడు మరింత గొప్ప పొజిషన్లో ఉండేవారని నిష్టూరమాడుకోవడం.. సహజంగా ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనిపిస్తుంది. అయితే.. వారికి ఆ వయసులో.. పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సినంత ఉండకపోవడమే మధ్యతరగతి ప్రజల శాపం. దాన్ని.. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేసింది. విద్యార్థుల భవిష్యత్‌పై ఆ పెట్టుబడి తాను పెట్టేందుకు.. సిద్ధమయింది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన పథకాలతో… విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు అనని ఏర్పాట్లు చేసింది. ఈ రెండు పథకాలకు రూ. 11, 417 కోట్ల ను కేటాయించారు. అంటే.. ఈ విద్యాసంవత్సరంలో.. విద్యపై.. ప్రభుత్వం పెట్టుబడి అసాధారణంగా పెరిగింది. దీని ఫలాలు భవిష్యత్‌లో కనిపిస్తున్నాయి. ఆంధ్ర మధ్యతరగతి విద్యార్థులు.. జగనన్న పథకాలతో.. పొందే ప్రయోజనంతో… విద్యలో దూసుకెళ్లే అవకాశం ఉంది.
అన్నదాతకు తోడూనీడ.. అండాదండ..!
వ్యవసాయానికి అన్ని ప్రభుత్వాలు అగ్ర ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ ఉంటాయి. భూరిగా కేటాయింపులు చేస్తూంటారు. కానీ…అమలుకు వచ్చే సరికే.. తేడా కొడుతూంటాయి. దాంతో రైతుల పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కానీ ఏపీ సర్కార్ తొలి పద్దులో మాత్రం వైవిధ్యం చూపించింది. మరో మూడేళ్లలో… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వినూత్నమైన ప్రణాళికలు అమలు చేసింది. ఉచిత బోర్లు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి లాంటి మౌలిక సదుపాయాలను కల్పించే పథకాలకు మాత్రమే కాదు.. విపత్తు సహాయనిధి, ధరల స్థీరికరణ నిధులతో.. రైతులకు… పడిన కష్టానికి ఫలితం వచ్చే ఏర్పాటు చేశారు. ఇక.. రైతు భరోసాతో.. వారికి ఒకే సారి.. ఏక మొత్తంగా ఇచ్చే పెట్టుబడి సాయం.. రూ. 12,500 పంటలు వేసుకునే సమయంలో… వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి.. బయట పడేలా చేస్తుంది. ఇవన్నీ.. ఆంధ్రప్రదేశ్ రైతును.. దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి పనికొస్తాయి.
ప్రజల ఆరోగ్యమే.. ఆంధ్రప్రదేశ్ మహాభాగ్యం..!
ఎవరికైనా ఆరోగ్యం బాగుంటేనే… వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే .. రాష్ట్రం కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఈ విషయంలో.. నవ్యాంధ్ర రెండో ప్రభుత్వం.. తన ప్రాధాన్యతలను చాలా ఘనంగా చాటింది. రూ. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల… మధ్యతరగతి ప్రజలు.. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. వైద్యానికి ముందూ వెనుకాడే పరిస్థితి పోతుంది. ఫలితంగా… ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య ప్రమాణాలు అంతకంతకూ పెరుగుతాయి. అలా పెరిగితే.. ఆంధ్రప్రదేశ్… అభివృద్ధి చెందినట్లే.
మొత్తంగా… ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… ప్రజలపై పెట్టే ఖర్చు.. నగదు బదిలీ పథకాలు.. కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదని… అంతకు మించిన ప్రయోజనం… రాష్ట్ర అభివృద్ధి.. ప్రజల సంక్షేమంతో.. మానవ వనరుల అభివృద్ధి ఉంటుందని… ఈ బడ్జెట్‌తో నిరూపించగలిగారు.