ఐదేళ్ల అరాచక నీడ నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఎవరైనా రూపాయి పెట్టుబడితో రావాలంటే వణికిపోయే పరిస్థితి నుంచి మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెడితే బెటరన్న ఆలోచనలకు పెట్టుబడిదారులు వస్తున్నారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ పారిశ్రామికవేత్తల్ని అబ్బుర పరిచింది. వారిని అ ప్రజెంటేషన్ ఏపీ వైపు లాక్కొస్తోంది. అది సోషల్ మీడియాలో వారి స్పందనను బట్టే తెలియచేస్తోంది.
ఐదేళ్ల పాటు ఏపీ వైపు రావడానికి భయపడిన పారిశ్రామికవేత్తలు
నిజంగా ఏపీకి ఇది ఓ రకంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే.. ఏపీలో ఇక భవిష్యత్ లో పెట్టుబడులు పెట్టబోం అంటూ… ప్రఖ్యాత లూలూ సంస్థ ప్రతినిధులు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేలా వేధించిన దౌర్భాగ్య ప్రభుత్వం పాలన చేసిన చేసిన రాష్ట్రం ఏపీ. సొంత రాష్ట్రానికి చెందిన ప్రపంచ స్థాయి కంపెనీ అమరరాజాను మూసేసి వెళ్లిపోవాలని వేధించిన ఘోరమైన పాలన చూసిన రాష్ట్రం ఏపీ. ఇవి ఓ రెండు ఉదాహరణలు మాత్రమే .. వైసీపీ హయాంలో ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు పడిన వేదనలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఏపీ వైపు పారిశ్రామిక వేత్తల్ని చూసేలా చేయడం అంటే చిన్న విషయం కాదు.
భూతం భూస్థాపితం అవుతుదంని నమ్మకం
చంద్రబాబు కూడా అదే చెబుతూంటారు. భూతాన్ని భూస్థాపితం చేస్తే తప్ప పెట్టుబడిదారులు పెద్దగా ఆసక్తి చూపరని .. చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడం రానున్న రోజుల్లో ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉండదని గట్టి నమ్మకం ఏర్పడుతున్న సమయంలో పెట్టుబడిదారులు క్రమంగా నమ్మకం పెంచుకుంటున్నారు. ఏపీపై జగన్ నీడ… మెల్లగా దూరం అవుతున్న సూచనలు ఈ కారణంగానే కనిపిస్తున్నాయి. పాతవన్నీ మర్చిపోయి.. చంద్రబాబు హయాంలో ఏపీలో ఉన్న అవకాశాల్ని దక్కించుకోవడానికి ముందుకు వస్తున్నారు.
చంద్రబాబు కృషితో క్రమంగా పెరుగుతున్న నమ్మకం
పారిశ్రామిక వేత్తలకు ఏ రాజకీయ నాయకుడిపైనా అభిమానం లేదా కోపం ఉండదు. వారికి తమ పెట్టుబడులు ముఖ్యం. ఎవరు ప్రోత్సహిస్తే వారి వద్దకు వెళ్తారు. అమ్మో జగన్ అని ఎందుకు అంటారంటే.. ఆయనకు కావాల్సింది రాష్ట్రం కాదు.. సొంత ప్రయోజనాలు. పెట్టుబడుల్లో కమిషన్లు కోరుకుంటారు. అప్పనంగా వాటాలు కోరుకుంటారు. ప్రభుత్వ పరంగా కల్పించే సౌకర్యాలకు తనకు ప్రయోజనం కల్పించాలంటారు. క్విడ్ ప్రో కో లో జరిగింది అదే. సీఎంగానూ అదే చేశారు కాబట్టే పారిశ్రామిక వేత్తలు పరారయ్యారు. అలాంటి ఘోరాల తర్వాత కూడా పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు కృషే.