హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంకా రెండు నెలలు కాక ముందే పలు సంస్థలు తమ భారీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. లక్షల Sftల కార్యాలయాలను లీజుకు తీసుకుంటున్నాయి. గచ్చిబౌలి ప్రాంతంలో ఈ కార్యాలయాలు కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్కు పెట్టుబడులు రావడం లేదు అని ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా వెల్లువలా వస్తున్న రియాలిటీలోకి వస్తున్న పెట్టుబడుల ప్రకటనలు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమన్న అభిప్రాయం వచ్చేలా చేస్తోంది.
గత రెండు నెలల్లోనే ఆఫీస్ లీజింగ్ లో రికార్డులు
2025లో రెండు నెలలలోనే పలు ప్రఖ్యాత సంస్థలు గ్లోబల్ క్యాపబిలిటి సెంటర్స్ ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. ఇప్పటికే మెక్ డొనాల్డ్ కంపెనీ చేసుకున్న లీజు ఒప్పందం ఇండస్ట్రీ వర్గాల్లోనే హాట్ టాపిక్ అయింది. తర్వాత గుడ్ ఇయర్ , డార్క్ మాటర్, సొనోకో, వాన్ గార్డ్, మల్టివాక్, మెర్క్, యూబీఎస్ సంస్థలు తమ జీసీసీలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించాయి. వాటికి అవసరమైన ఆఫీసుల్ని లీజుకు తీసుకుంటున్నాయి. అలాగే ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న అమ్జెన్ కంపెనీ ఐదు లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకుంది. సనోఫీ మరో 2లక్షల 70వేల ఎస్ఎఫ్టీని లీజుకు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. గ్లోబర్ క్యాపబిలిటి సెంటర్లను ఏర్పాటు చేయడం విస్తరించడంలో ఈ మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
2025లో రికార్డు స్థాయి పెట్టుబడులు, ఉద్యోగాలు ఖాయమే
గత ఏడాది వివిధ కారణాల రీత్యా స్లంప్లో ఉన్న ఆఫీస్ లీజింగ్ ఈ ఏడాది మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని తొలి నెలన్నరోనే జరుగుతున్న ఒప్పందాలు నిరూపిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు జరిపిన విదేశీ పర్యటనల్లో చేసుకున్న ఒప్పందాల్లో అత్యధికం మెటీరియలైజ్ అవుతున్నాయి. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేకత, పారిశ్రామిక వాతావరణాన్ని రాజకీయం డిస్ట్రబ్ చేయకపోడవం, ఇంకా ప్రోత్సహించే పరిస్థితి ఉండటంతో హైదరాబాద్ రికార్డులు సృష్టించడం ఖాయమని అనుకోవచ్చు.
కేటీఆర్ లేని లోటే కనిపించడం లేదుగా !
కేటీఆర్ లేకపోతే పెట్టుబడులు రావడం లేదని.. ప్రభుత్వానికి చేత కావడం లేదన్న ప్రచారం గత కొంత కాలంగా బీఆర్ఎస్ చేస్తోంది. కేటీఆర్ అద్భుతమైన ఇంగ్లిష్ తో అందరితో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేవారని.. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదన్నట్లుగా విమర్శలు చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అధికారంలో ఎవరు ఉన్నా.. ఆ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం కొనసాగితే చాలు.. హైదరాబాద్కు పెట్టుబడుల సమస్యే ఉండదని స్పష్టమవుతోంది. అప్పట్లో కీలక పాత్ర పోషించిన జయేష్ రంజనే.. ఇప్పుడు కూడా కీలకంగా ఉన్నారు. ఇన్వెస్టర్లతో ఆయన నిరంతరం టచ్ లో ఉండి… పరిస్థితులు చక్కదిద్దుతున్నారు.