ఏపీ రాజధాని అంశంపై విశాఖలో ఇన్వెస్టర్ల మీట్ పేరుతో విశాఖ విజన్ అంటూ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. చివరికి జగన్ తన రాజధాని చేతకాని తనాన్ని చెప్పుకున్నారు. ఐదేళ్లలో తాను ఏమీ చేయలేకపోయానని మళ్లీ గెలుస్తానని.. మళ్లీ వచ్చి విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తానని.. ఇక్కడే కాపురం పెడతానని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి అదే మాట చెబుతున్నారు. ఇదిగో వైజాగ్ వస్తున్నా.. అదిగో వైజాగ్ వస్తున్నా అన్నారు కానీ.. ఒక్క అడుగు ముందుకేయలేకపోయారు. రుషికొండకు గుండుకొట్టి.. ఐదు వందల కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. కామెడీ ఏమిటటంటే..దీన్నే ఆయన తన కమిట్ మెంట్గా చెప్పుకున్నారు.
అమరావతిలో రాజధాని కట్టాలంటే లక్ష కోట్లు ఖర్చవుతుందని తన పాత పాటే పాడారు. కట్టిన భవనాలను కూడా తాకట్టు పెట్టుకుంటూ.. వేల కోట్లు అప్పులు చేస్తూ.. రాజధాని కట్టలేనంటూ.. చేతకాని అరుపులు అరవడం అయనకే సాధ్యం. తలుపులు కిటికీలు బిగిస్తే అయిపోయే భవనాలను కూడా పాడు పెట్టి.. అవి పూర్తయ్యాయని చెప్పి .. అప్పులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కానీ.. రాజధాని మాత్రం కట్టలేనని చెబుతున్నారు. మళ్లీ గెలిస్తే మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఏం చేయగలరో చెప్పడం లేదు. విశాఖ వస్తా.. ప్రమాణస్వీకారం చేస్తా అన్న కబుర్లే తప్ప.. విశాఖకు ఐదేళ్లలో ఏం చేశానో చెప్పలేదు. ఐదేళ్లలో విశాఖ ఒక్క ఐటీ పరిశ్రమను తీసుకు రాకపోగా.. ఉన్న వాటిని వెళ్లగొట్టారు. భూకబ్జాలకు కేంద్రంగా మార్చారు.
ఎలా చూసినా అసలు లేని రాజధాని సమస్యను సృష్టించి జగన్ మోహన్ రెడ్డి అందులో నిలువుగా మునిగిపోతున్నారు. రాజధాని ని కావాలని విశాఖ వాసులు ఎప్పుడూ అడగలేదు. అడిగి ఉంటే.. రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసినప్పడే అడిగి ఉండేవారు. కానీ వారిలో లేకుండానే.. తన రాజకీయం కోసం.. తీర ప్రాంతాన్ని దోచుకోవడం కోసం.. విశాఖ రాజధాని అని ప్రారంభించి… ఐదేళ్లలో వందల ఎకరాలు రాయించేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు వచ్చి అదే పాట పాడుతున్నారు.