ఎవరైనా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తూంటే ఐ ఫోన్ తెస్తావా.. మ్యాక్ బుక్ తెస్తావా అని అడిగేవాళ్లు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడితో పోలిస్తే అమెరికాలో ఓ ఇరవై శాతం వరకూ తక్కువ రేటు ఉంటుంది. కానీ ఇదంతా ట్రంప్ రాక ముందు. పన్నులు వేయక ముందు. ఇప్పుడు పన్నులు బాదిన తర్వాత ఐ ఫోన్ సహా అమెరికన్లు వాడే అత్యధిక గాడ్జెట్లు భారీగా రేట్లు పెరగనున్నాయి.
తైవాన్ నుంచి ఎక్కువగా అమెరికాలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఎగుమతి అవుతాయి. యాపిల్ కంపెనీ అమెరికాదే కానీ తయారీ అంతా చైనా, తైవాన్ వంటి చోట్లనే ఉంటుంది. వాటిని అమెరికాకు ఎగుమతి చేసుకోవాలి. తైవాన్ పై ట్రంప్ 34 శాతం పన్నులు విధించడంతో ఆ మేరకు ధరలు పెరగనున్నాయి. ఇప్పుడు ఇండియాలోనే ఆ ఫోన్లు చౌకగా లభించే అవకాశాలు ఉన్నాయి.
ఒక్క ఐ ఫోన్ మాత్రమే కాకుండా అమెరికాలో టెక్ గాడ్జెట్ల ధరలు భారీగా పెరనున్నాయి. ఇది అక్కడి ప్రజల పై ఎక్కువ ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇది అమెరికాను సంక్షోభంలోకి నెట్టేస్తుదంన్న ఆందోళన వినిపిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు.