దేశంలో కరోనా పరిస్థితులు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఆంక్షల దిశగా అన్ని రాష్ట్రాలు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. గత ఏడాది అనుభవంతో ఈ సారి కాస్త ముందుగానే ఐపీఎల్ ప్రారంభించాలని ్నుకున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అలాగే ఈ సారి రెండు కొత్త టీములు వచ్చాయి. ఈ కారణంగా ఆక్షన్‌ను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి ఉంది.
వచ్చే నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఇప్పుడు ఆక్షన్‌తో పాటు ఐపీఎల్ టోర్నీ భవిష్యత్పైనే నీలి నీడలు ప్రారంభమయ్యాయి. ఆక్షన్‌ను ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం ఉంది. కానీ క్రికెట్ గ్రౌండ్లో మాత్రమే ఆడాలి. అందుకే ఐపీఎల్ టోర్నీపై మళ్లీ సందేహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి అప్పటికి కరోనా పరిస్థితులు పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయని ప్రయాణ ఆంక్షలు కూడా తొలగిపోతాయని భావిస్తున్నారు.
కానీ గతంతో పోలిస్తే ఈ సారి వైరస్ కలకలం ప్రారంభం కావడానికి ముందే వచ్చింది. అందుకే ఇండియాలో గడ్డు పరిస్థితులు ఎదురైతే.. వెంటనే విదేాల్లో నిర్వహించడానికి బీసీసీఐ కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ టోర్నీ ఆగకూడదని భావిస్తున్నారు.