సమ్మర్ వచ్చిందంటే ఐపీఎల్ సీజన్ వచ్చినట్లే. వరుసగా పద్దెనిమిదో ఏడాది ఏడాది ఐపీఎల్ సీజన్ నేడు ప్రారంభంకానుంది. ఫస్ట్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. గత ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ కావడంతో IPL మొదటి మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా మారింది. ముందు గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరుగుతుంది. గత ఐపీఎల్ సీజన్లలా కాకుండా, ఈ ఏడాది IPL 13 వేదికలలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఐపీఎల్లో మొత్తం 10 జట్లు ఉండగా.. 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యూజిక్, ఎంటర్ టైన్మెంట్తో కార్యక్రమాలతో ఐపీఎల్ 2025 గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. క్రికెట్‌కు మంచిదా కాదా అన్న సంగతి పక్కన పెడితే అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా రానంత క్రేజ్ ఐపీఎల్ మ్యాచ్‌లకు లభిస్తోంది. ప్రపంచకప్ కన్నా ఐపీఎల్‌కే ఎక్కువ ఆదరణ ఉంటోంది. లోకల్ టీములు తలపడే మ్యాచ్‌లకు .. స్టేడియాలన్నీ కిటకిటలాడిపోతూంటాయి. ఈ సారి కూడా అంతే.
ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్ ను నాశనం చేస్తోందన్న అభిప్రాయం ఉంది. అయితే ఐపీఎల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ టీమ్‌లోకి వచ్చేస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రతిభ ఎక్కడ వెలుగు చూసినా ప్రతిభ కాబట్టి ఈ విషయంలో ఐపీఎల్ మేలు చేస్తుందని అనుకోవచ్చు.