ఐపీఎల్ వేలంలో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును క్రిస్ మోరిస్ అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్ నిలిచాడు. ఆయనను రాజస్థాన్ రాయల్స్ పంజాబ్‌తో పోటీ పడి..
రూ.16.25 కోట్లకు పాడుకుంది. చెన్నైలో జరుగుతున్న ఐపీఎల్ వేలంలో క్రిస్ మోరిస్ జాక్ పాట్ కొట్టినట్లయింది. గతంలో యువరాజ్‌సింగ్ రూ.16 కోట్ల ధరను దక్కించుకున్నాడు. క్రిస్ మోరిస్ గతంలో ఢిల్లీకి ఆడేవారు. ఆయనను గతంలో రూ. ఏడు కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. ఉపయోగపడటం లేదని రిలీజ్ చేసింది. ఆయన ఈ సారి డబుల్ కన్నా ఎక్కువ పే ప్యాకేజీ పొందుతున్నారు. హాట్ ఫేవరేట్ గా ఉన్న గ్లెన్ మ్యాక్స్ వెల్ రూ. 14 కోట్ల 25 లక్షలకు బెంగళూరు దక్కించుకుంది. మ్యాక్స్ వెల్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరచడంతో ఆయనను టీం వదులుకుంది. ఇప్పుడు… ఆయనను బెంగళూరు దక్కించుకుంది.
ఆస్ట్రేలియా యువ క్రికెటర్ జోయ్ రిచర్డ్ సన్‌కు రూ. ఫధ్నాలుగు కోట్ల జాక్ పాట్ తగిలింది. ఆయన ఫాస్ట్ బౌలర్. స్టీవ్ స్మిత్‌ను రూ.2.20 కోట్లకు ఢిల్లీ జట్టు దక్కించుకుంది. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్ 3.2 కోట్లు, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్అలీకి రూ.7 కోట్లకు చెన్నై దక్కించుకుంది. శివం దూబేను రూ.4.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. డావిడ్ మాలన్‌ను ఒకటిన్నర కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లు.. గతంలో ఇతర టీముల్లో ఉండి.. ఆయా టీములు… తమకు అవసరం లేదని వదిలేసిన ఆటగాళ్లను వేలంలో ఉంచుతారు. అంటే.. ఇప్పుడు అత్యధిక ధరలు పలికిన వారంతా జాక్ పాట్ కొట్టినట్లేనన్నమాట.
కీలమైన ప్లేయర్లుగా పేరు పొందిన చాలా మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. హనుమ విహారి, కరుణ్నాయర్, అలెక్స్ హేల్స్, జాసన్‌రాయ్, కేదార్ జాదవ్, ఫించ్, ఎవిన్ లెవిస్ వంటి వారిని ఫ్రాంచైజీలు లైట్ తీసుకున్నాయి. విశేషం ఏమిటంటే.. కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాళ్లు ఐపీఎల్లో వీరోచితంగా ఆడిన సందర్భాలు తక్కువే. వారిపై విపరీతమైన ఒత్తిడో.. మరో కారణమో కానీ జట్టుకు విజయాలు అందించిన దాఖలాలు లేవు.