ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ నక్కతోకను తొక్కాడు. వచ్చే ఐపీఎల్లో ఏకంగా రూ. పదిహేను కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయాడు. వేలంలో కమ్మిన్స్ జరిగిన పోటీలో.. కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. సాధారణంగా… టీ ట్వీంటీల్లో బ్యాట్స్మెన్లకే ఫ్రాంచైజీలు ప్రాధాన్యం ఇస్తాయి. కానీ కేకేఆర్ ఈ సారి బౌలర్ కోసం.. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కమ్మిన్స్.. టీ ట్వీంటీల్లో… సంచలనాలేమీ సృష్టించలేదు.. కానీ.. ఫలితాలను తారుమారు చేయగలశక్తి ఉన్న ఆటగాడిగా గుర్తిస్తారు.
మరో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. పది కోట్ల 75 లక్షలు వెచ్చించింది. కేకేఆర్ టీంకు షారుఖ్… పంజాబ్ టీంకు ప్రీతి జింటా కో ఓవర్స్. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌మోరిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్లకు , ఇంగ్లాండ్ పేసర్ సామ్ కరన్‌ను 5.50 కోట్లకు చెన్నై టీం వేలంలో పాడుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కోల్‌కతా రూ.5.25 కోట్లకు చేజిక్కించుకుంది. ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ను ఆర్సీబీ రూ.4.40 కోట్లకు తీసుకుంది.
భారత ఆటగాళ్లలో రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో యువరాజ్ సింగ్‌కు అత్యధిక ధర పలికింది. దాదాపుగా పదిహేడు కోట్ల వరకూ యువరాజ్ ఒక్క సీజన్ కు సొంతం చేసుకున్నాడు. అయితే.. ఓ విదేశీ ఆటగాడికి మాత్రం.. ఇంత వరకూ అంత పెద్ద మొత్తం అవకాశం రాలేదు. ఆ చాన్స్‌ను పాట్ కమ్మిన్స్ మొదటి సారి పొందాడు. పలువురు భారత ఆటగాళ్లపై ఈ సారి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.