ఐపీఎల్ వేలంలో.అందరూ అనుకున్నట్లుగానే రిషబ్ పంత్కు జాక్ పాట్ తగిలిగింది. ఆయన కోసం టీములు పోటీ పడ్డాయి. చివరికి లక్నోసూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ప్రమాదం కారణంగా క్రికెట్కు దూరమై కోలుకుని మళ్లీ బరిలోకి దిగిన తర్వాత గతం కన్నా బాగా ఆడుతున్న పంత్ మంచి కీపర్ కూడా అవడంతో ఆయన కోసం జట్లు పోటీ పడతాయని అనుకున్నారు. అనుకున్నట్లుగానే రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ప్రారంభించి.. ఇరవై ఏడు కోట్లకు చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో?అత్యధిక మొత్తం రిషబ్ పంత్ దక్కించుకున్నారు. అంతకు ముందు శ్రేయస్ అయ్యర్ది కూడా అత్యధిక ధరే. అయితే ఈ వేలంలోనే పంత్ దాన్ని అధిగమించాడు.
అనూహ్యంగా శ్రేయస్ అయ్య ర్ కోసం కూడా జట్లు పోటీ పడ్డాయి. ఆయననుపంజాబ్ కింగ్స్ జట్టు .. పంత్ కంటే..రూ. పాతిక లక్షలు తక్కువకు దక్కించుకుంది. ఇరవై ఆరు కోట్ల 75 లక్షల రూపాయల ప్రైస్ ట్యాగ్ శ్రేయస్ అయ్యర్ సొంతం అయింది. పంజాబ్ కింగ్స్ జట్టు ఆర్షదీప్ సింగ్ కోసం రూ. పద్దెనిమిది కోట్లు వెచ్చించి.. యువప్లేయర్ పై కనకవర్షం కురిపించింది. గుజరాత్ టైటన్స్ జట్టు జోస్ బట్లర్ కోసం రూ. 15 కోట్ల 75 లక్షలు వెచ్చించింది.
చాలా జట్లు రిటైనర్లను తక్కువగా ఉంచుకుని మంచి ఆటగాళ్లను వేలంలో దక్కిచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా గుడ్ ప్లేయర్స్ అనుకున్న వారిని దక్కిచుకోవడానికి ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున తమ పర్సులోని నిధులను ఉపయోగిస్తున్నాయి. అయితే రిషబ్, అయ్యర్ల స్థాయిలో మరో ఆటగాడికి ఫ్రాంచైజీలు వెచ్చించే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.