వైసీపీ సోషల్ మీడియా కీచకుల్లో ఒకరు అయిన ఇప్పాల రవీంద్రారెడ్డి అనూహ్యంగా బయటపడ్డారు. ఒకప్పుడు ఘోరమైన పోస్టులతో అరాచకం చేసిన ఆయన ఇటీవలి కాలంలో కనిపించడం లేదు. దాంతో అందరూ మర్చిపోయారు. కానీ అతడు అవారా కాదు. వైసీపీ పేటీఎం కూడా కాదు. సిస్కోలో మంచి పొజిషన్ లో ఉన్న ఉద్యోగి. ఆ విషయం తాజాగా బయటపడింది. సిస్కోతో విద్యామంత్రి లోకేష్ సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టేందుకు ఓ ప్రతినిధి బృందం సిస్కో నుంచి వచ్చింది.
ఆ ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాక.. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత గగ్గోలు రేగింది. లోకేష్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ అయ్యారని అలా ఎలా అంగీకరించారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. దాంతో లోకేష్ టీం వెంటనే క్రాస్ చెక్ చేసుకుంది. సిస్కో బృందంలో వచ్చిన వ్యక్తుల పేర్లను చూసింది. ఐ.రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. దీంతో అతనే ఇప్పాల రవీందారెడ్డి అనే క్లారిటీకి వచ్చారు. ఓ చీప్ ..సోషల్ మీడియా పోస్టులు పెట్టే వ్యక్తి సిస్కోలో ఉన్నత స్థానంలో ఉంటాడని ఎవరూ ఊహించలేకపోయారు.
వెంటనే సిస్కో యాజమాన్యానికి లోకేష్ ఓఎస్డీ లేఖ రాశారు. ఇప్పాల రవీంద్రారెడ్డి సోషల్ మీడియా రికార్డుతో పాటు అతనిపై నమోదైన కేసుల వివరాలును కూడా పంపారు. ఇంకెప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు ఆ వ్యక్తిని తీసుకు రావొద్దని స్పష్టం చేశారు. ఇప్పాల రవీంద్రారెడ్డి ఇప్పుడు పోస్టులు పెట్టడం లేదు కానీ. ఆయన జీవితం మాత్రం ఇక రిస్కులో పడిపోయింది. ఆయన ఉద్యోగం కొనసాగింపుపై సిస్కో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఘోరమైన సోషల్ మీడియా రికార్డు ఉన్న వారిని అదీ కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకున్న వారిని సహించే అవకాశం ఉండదు. అందుకే ఇప్పాల రవీంద్రారెడ్డి అడ్డంగా దొరికిపోయాని సెటైర్లు పడుతున్నాయి.