తెలంగాణ మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ కూడా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆయనను విభజన సమయంలో ఏపీకి కేటాయిస్తే తెలంగాణలోనే ఉండిపోయారు. బీఆర్ఎస్ పెద్దలకు అతి సన్నిహితంగా ఉంటూ వారికి కావాల్సినట్లుగా పోలీసింగ్ చేసి డీజీపీ కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆయనే డీజీపీ. కానీ కాంగ్రెస్ గెలిచేసిందని క్లారిటీ వచ్చేసిన తర్వాత సీటు కాపాడుకోవడానికి ఫలితాలు పూర్తిగా వెల్లడించక ముందే బోకె పట్టుకుని రేవంత్ ఇంటికి పోవడంతో ఈసీ వేటు వేసింది.
బీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ నేతల్ని ముఖ్యంగా రేవంత్ ని ఆయన చాలా ఇబ్బంది పెట్టారు . అందుకే లూప్ లైన్ లోనే ఉంచారు. ఆయన హైదరాబాద్ కమిషనర్ గా పని చేసిన సమయంలో డేటా చోరీ పేరుతో వైసీపీ నేతలు కేసు పెడితే.. అసలు ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో అంజనీకుమార్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. టీడీపీ యాప్ ద్వారా ఓట్లు తొలగించారని మ్యాప్ గీసి చూపించారు. కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అనే తండ్రీకూతుళ్ల ఓట్లను కేస్ స్టడీగా తీసుకుని ఎక్స్ ప్లెయిన్ చేశారు. ఏపీ ఓట్ల జాబితాలో ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇప్పుడు ఐ ఐడీ నెంబర్‌తో స్టేటస్ నాట్ ఫౌండ్ అని ఉందని.. కాబట్టి తీసేశారని.. చెప్పుకొచ్చారు. కానీ వారి ఓట్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.
మామూలుగా పోలీసు అధికారులు సెర్చ్ చేసి చెబుతారా.. అధికారింగా ఈసీని సంప్రదిస్తారా ? ఈ ఐపీఎస్ మాత్రం వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేసి చేశారు. విజయవాడలో ఓటు పోయిందని హైదరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆయన కమిషనరేట్ పరిధిలోనే దొరికిందని అప్పట్లోనే నెటిజన్లు బయట పెట్టారు. చెప్పుకోవాలంటే అప్పట్లో సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్.. హైదరాబాద్ కమిషనర్‌గా చేసిన ఈ అంజనీకుమార్ .. చేసిన పొలిటికల్ కేసుల అరాచకాలకు లెక్కే లేదు. ఇప్పుడు అంజనీకుమార్‌కు ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ టీడీపీ నేతలకు అంజనీకుమార్‌కు సరైన బుద్ది చెప్పే అంత తీరిక, ధైర్యం ఉందా అన్నదే అసలు క్వశ్చన్.