జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికి రఘురామపై సుమోటోగా దేశద్రోహం కేసు పెట్టి హత్యచేయడానికి ప్రయత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అతిగా స్పందిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలతో ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. రఘురామను కస్టోడియల్ టార్చర్ చేయడంపై అన్ని సాక్ష్యాలను సేకరించేశామని మీడియాకు లీకులు వచ్చాయి. దీనిపై పీవీ సునీల్ కుమార్ విచిత్రంగా స్పందించారు.
తాను సీఐడీ ఆఫీసుకు వచ్చినట్లుగా ఎవరూ వాంగ్మూలం ఇవ్వలేదని ఆయన తనకు తాను స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. అంతే కాదు కాల్ రికార్డులు ఆరు నెలలే ఉంటాయట. లోకేషన్ డేటా అసలు కనిపెట్టలేరట. ఇంకా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా వైద్యులు అంగీకరించబోరని అలా చేస్తే వారి డాక్టర్ సర్టిఫికెట్ రద్దవుతుందట. అంతే కాదు.. మిలటరీ ఆస్పత్రి వైద్యులకు కోర్టుకు రాకుండా రక్షణ ఉంటుందట.. ఇలాంటి విచిత్రాలతో…. పీవీ సునీల్ తన వాదన వినిపించారు. అంతే కానీ… రఘురామను కొట్టలేదని మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేతుల్లో పావుగా మారి సునీల్ కుమార్ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి టీడీపీ లీడర్ ను అరెస్టు చేయడం.. వారిపై తప్పుడు ప్రచారాలకు మీడియాకు లీకులు ఇవ్వడం. సొంత డిపార్టుమెంట్ లో అధికారులపై కుట్రలు కూడా ఎక్కువే. ఇప్పటికీ తాను ఐపీఎస్ అన్నట్లుగా కాకుండా రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన కంటే తెలివి గల వాళ్లు ఉంటారని.. చట్టం నుంచి.. తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరన్న విషయాన్నిఆయన గుర్తించలేకపోతున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.