ప్రపంచం అప్రకటిత థర్డ్ వరల్జ్ వార్‌కు వెళ్లిపోయింది. అణుబాంబులు తప్ప అన్ని పేలిపోతున్నాయి. మా జోలికి వస్తే అణుబాంబులు వేయడం ఒక్క నిమిషం పని అని హెచ్చరికలు జోరుగా వస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోతలు ఇంకా అలాగే ఉండగానే.. పశ్చిమాసియా రలిగిపోతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా ,గాజా ఇలా ఇంతకంతకూ యుద్ధం విస్తరించుకుంటూ పోతోంది. ఇది ప్రపంచదేశాలనుప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ , ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతం నిత్య ఉద్రిక్తతలు ఉంటాయి. ఆ దేశాల మధ్య చాలాకాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. ఇప్పుడు నువ్వా, నేనా అని తేల్చుకోవాలని అనుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమయింది. ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్ విషయంలో అమెరికా సీరియస్ గా ఉంది. నాటో ఈ విషయంలో తలదూరిస్తే ఎక్కడికి వెళ్తుందో చెప్పడం కష్టం.
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతూ ఉంది. ఉక్రెయిన్ కు భారీ ఆయుధాలు ఇవ్వాలని కొత్త బ్రిటన్ ప్రధాని నిర్ణయించారు. తమ దేశంపై దాడిచేసేందుకు ఆయుధాలను ఉక్రెయిన్ కు ఎవరైనా ఇస్తే.. ఆ దేశాలు తమపై దాడి చేసినట్లుగా భావించి అణుబాంబులు వేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అమెరికా, బ్రిటన్ లపై అణుబాంబులు ఎన్ని కావాలంటే అన్ని వేయగల సామర్థ్యం రష్యాకు ఉంది. ఇలా మొత్తం దేశాల మధ్య ఏర్పడుతున్న యుద్ధాలు. ఆయాదేశాలతోనే ఆగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. ప్రపంచం మొత్తం పాకిపోయి మూడో ప్రపంచ యుద్ధంగా ప్రకటించేసుకున్నా ఆశ్చర్యం లేదని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే స్వీయ వినాశనం దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు.