ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో రయీసీతోపాటు విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు.
హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో వారిద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్రహీం రయీసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయినట్లుగా వెల్లడించాయి. దట్టమైన పొగ మంచు కారణంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఇబ్రహీం రయీసీ , హోసేన్ అమీర్ అబ్దుల్లా ప్రాణాలతో ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు…అజర్ బైజాన్ కు మూడు హెలికాప్టర్లు వెళ్ళగా ఓ హెలికాప్టర్ లో ఇబ్రహీం , హోసేన్ అమీర్ ఉండగా మిగతా రెండు హెలికాప్టర్లు వారి రక్షణ కోసం ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్ దేశాద్యక్షుడి రక్షణ కోసం వెళ్ళిన రెండు హెలికాప్టర్లు సురక్షితంగానే ఉండగా ఇబ్రహీం ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ మాత్రమే ప్రమాదానికి గురి కావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి.
దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా..? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.