ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగబోతుందా..? అధికారుల విచారణ పూర్తి కావడంతో నెక్స్ట్ రాజకీయ నేతలను విచారణకు పిలుస్తామనే హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో ఫస్ట్ నోటిసులు ఎవరికి ఇవ్వబోతున్నారు..? లోక్ సభ ఎన్నికల ముందు పోలీసులు సంచలనం సృష్టించబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణ పూర్తి కావడంతో రాజకీయ నాయకులను విచారణకు పిలుస్తామని సీపీ శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో ఎవరికి మొదట నోటిసులు ఇస్తారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్ రావు దుబాయ్ నుంచే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం నేపథ్యంలో… ఈ కేసులో మొదట ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు వినిపించాయి. దాంతో ఈ కేసులో తొట్టతొలి నోటిసులు అందుకునే లీడర్ ఎవరని చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా అంగీకరించడంతో..నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్ లలో ఒకరికి నోటిసులు ఇస్తారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి నోటిసులు ఇచ్చే సాహసం చేస్తారా..?మరికొద్ది రోజులు వెయిట్ చేస్తారా..?ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని విదేశాల నుంచి తెప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీని మొదట విచారణకి పిలుస్తారా..?అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎవరిని వదలొద్దని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్ట్ చేసే సాహసం చేస్తారా..? అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందుగా ఎవరికీ నోటిసులు ఇవ్వాలనే దానిపై పోలీసులు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.