అ, జాంబీరెడ్డి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం `హనుమాన్` తెరకెక్కిస్తున్నాడు. ఇదో సైన్స్ ఫిక్షన్ తో కూడిన సోషియో ఫాంటసీ సినిమా అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ వెంటనే పూర్తి స్థాయి మాస్ సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని టాక్. గోపీచంద్ కోసం ప్రశాంత్ వర్మ ఓ కథ రెడీ చేశారని తెలుస్తోంది. ఇటీవల గోపీచంద్ కి కూడా వినిపించాడట. ఈ కథ కోసం ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతున్నాయని టాక్. ఈ కథకి గోపీచంద్ ఆల్మోస్ట్ ఓకే చెప్పేశాడని, హనుమాన్ తరవాత ఈ కథే పట్టాలెక్కబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. గోపీచంద్ ఖాతాలో హిట్టు పడి చాలా కాలం అయ్యింది. అయితే తనకు ప్రాజెక్టుల విషయంలో కొదవ లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందిన `పక్కా కమర్షియల్` విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదో మాస్ ఎంటర్టైనర్. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ. అందుకే గోపీచంద్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.